దేశ రాజధాని ఢిల్లీలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ప్రధాన కార్యాలయ భవనంలో పోయిన శనివారం అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ విషయాన్ని అక్కడి అధికారులు చెప్పారు. ఢిల్లీలోని, సుజాన్ సింగ్ పార్క్ దగ్గర ఉన్న, లోక్ నాయక్ భవన్ లో, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రధాన కార్యాలయం ఉంది. శనివారం సాయంత్రం ఒక్కసారిగా మంటలు రావటంతో, అందరూ కంగారు పడ్డారు. అయితే, ఎవరూ గాయపడటం జరగలేదని తెలిపారు. చీఫ్ ఫైర్ ఆఫీసర్ అతుల్ గార్గ్ చెప్పిన ప్రకారం శనివారం సాయంత్రం 4.25 నిమషాలకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రధాన కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది.

ed 21082018 2

ఎనిమిది ఫైర్ ఇంజిన్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రధాన కార్యాలయం దగ్గరకు చేరుకుని మంటలు ఆర్పటానికి ప్రయత్నాలు చేసాయి. ఈ ఎనిమిది ఫైర్ ఇంజిన్లు, దాదాపు గంట పాటు శ్రమించటంతో, మంటలు అదుపులోకి వచ్చాయని, చీఫ్ ఫైర్ ఆఫీసర్ అతుల్ గార్గ్ చెప్పారు. ఈ భవనం ఆరు అంతస్తుల్లో ఉందని, ఇక్కడ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రధాన కార్యాలయంతో పాటు, కేంద్ర ఆర్ధిక శాఖకు చెందిన కొన్ని కార్యాలయాలు కూడా ఉన్నాయని చెప్పారు. అయితే సకాలంలో స్పందించటంతో, పెద్ద ప్రమాదం తప్పినట్టు చెప్పారు. ఈ ఘటన పై ఎంక్వయిరీ జరుగుతుందని, ప్రాధమిక సమాచారం ప్రకారం షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు వచ్చాయని చెప్తున్నారు.

ed 21082018 3

మరో పక్క టైమ్స్ అఫ్ ఇండియా కధనం ప్రకారం, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయంలో, కొన్ని కీలక ఫైల్స్ , డాక్యుమెంట్లకు కూడా మంటలు అంటుకున్నాయనే సమాచారం ఉన్నట్టు చెప్తున్నారు. ఎన్నో ఆర్ధిక నేరాలు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ చేస్తుంది. మనీ లాండరింగ్ కు సంబంధించి, దేశంలో ఎంతో మంది ప్రముఖుల పై విచారణ జరుగుతుంది. మన ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి చేసిన దోపిడీ పై, ఇప్పటికే 5 ఈడీ కేసులు నడుస్తున్నాయి. ఈ కేసుల్లో జగన్ A1 కాగా, విజయసాయి రెడ్డి A2. మరి ఈ కేసులకు సంబంధించిన ఫైల్స్ అన్నీ భద్రంగా ఉన్నాయో లేదో ఈడీ తెలిపల్సిన అవసరం ఉంది. ఇది నిజంగా షార్ట్ సర్క్యూట్ వాళ్ళేనా, లేక ఎవరన్నా కావాలని చేసారా అనే దాని పై విచారణలో తేలనుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read