మొన్నా మధ్య ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకులు వచ్చేసాయి అని, తెలంగాణా మొదటి స్థానంలో ఉంది అంటూ, ఈనాడుతో సహా అనేక తెలంగాణా చానల్స్, పేపర్లు ఊదరగొట్టాయి... ఇదే నిజం అని నమ్మి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ విషయం పై అధికారులని సమీక్షకు పిలిచారు. నిజానికి ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకులు ఎక్కడా ప్రకటించలేదు... ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కూడా, ఈనాడులో వచ్చింది అని రివ్యూ చేసారు అంటే, ఈనాడు మీద ఉన్న నమ్మకం అలాంటింది... అలాంటి ఈనాడు, ఎందుకో కాని, తన పత్రికా విలువలు రోజు రోజుకీ దిగజారుస్తుంది... ఆంధ్రప్రదేశ్ మీద చిన్న చూపు చూస్తూనే ఉంది... తెలంగాణాకి మాత్రం బాకా కొడుతుంది..
తాజాగా కొత్త సంవత్సరం రోజున ఆంధ్రప్రదేశ్ లో ఈనాడు పేపర్ చూసిన వారు అవాక్కయ్యారు... మెయిన్ పేపర్ లో, మొదటి పేజి అంతా కెసిఆర్ ఫోటో వేసి, ఇవాల్టి నుంచి తెలంగాణా ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటలు కరెంటు ఇస్తున్నట్టు ఉంది.. అసలు ఇది ఆంధ్రప్రదేశ్ వారికి అవసరమా ? డబ్బులు ఇస్తే, మనోభావాలతో సంబంధ లేకుండా, ఏది పడితే అది ఈనాడు వేసేస్తుందా ? కెసిఆర్, ఆంధ్రా ప్రాంత ప్రజల్ని ఎన్ని తిత్తులు తిట్టాడో, అతని రాజకీయం పబ్బం గడుపుకోవటానికి మన రాష్ట్రాన్ని ఏమి చేసాడో ఈనాడు మర్చిపోయిందా ? లేక, ఇలాంటి పనికిమాలని "వ్యవసాయానికి 24 గంటలు కరెంటు" ఇక్కడ కూడా పెట్టాలి అని ప్రజలను రెచ్చగొట్టటానికా ? అవును ఇది పనికిమాలాన పధకం... ఎవరైనా ఆంధ్రా రైతులు దీని మీద అపోహలు ఉంటే, ఇది చూడండి ఎందుకు పనికిమాలింది అని చెప్తున్నామో...
ఇవాళ మన రాష్ట్రంలో, ఈనాడు ఎడిషన్ లో వచ్చిన "వ్యవసాయానికి 24 గంటలు కరెంటు" అనేది పెద్ద బూటకం... కరెంటు అధికంగా ఉంది కదా అని, కెసిఆర్ అక్కడి ప్రజలను మభ్య పెడుతున్నారు... రెంటు ఉంది అని, ఇలాంటి పనులు చేస్తే, 2-3 రోజులకు ఊరికే మోటర్లు ఆడించుకోవటమే... చుక్క నీరు రాదు... అండర్ గ్రౌండ్ వాటర్ ఆ ప్రాంతంలో కిందకు వెళ్ళిపోతుంది... మోటార్లు మరింత కిందకు వేయించాలి... అధిక సామర్ధ్యం ఉన్న మోటార్లు కొనాలి... లేకపోతే కొత్త బోర్లు వేయించాలి... ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది... మరో వారం పది రోజుల్లో అక్కడి రైతాంగం ఈ విషయంలో ఎలా ఎదురుతిరుగుతుందో మీరే చూడండి...మనకు ఇలాంటివి అవసరం లేదు... ఇలాంటివి ఇక్కడ వేసి, మనల్ని రెచ్చగొడతారు... విద్యుత్ రంగంలో మన రాష్ట్రానికి మించిన రాష్ట్రం లేదు... ఇలాంటివి చేస్తే ఏమి అనర్ధాలు వస్తాయో తెలుసు కాబట్టే చంద్రబాబు ఇలా మభ్య పెట్టకుండా, 9 గంటలు కరెంటు ఇచ్చి, నీరు-చెట్టు కార్యక్రమాలతో భూగర్భ జలాలు పెంచే కార్యక్రమాలు చేస్తున్నారు... ఇవి సఫలం అయ్యి, అనంతపురం లాంటి కరువు జిల్లాల్లోనే నీరు పుష్కలంగా ఉంటుంది... ఇలాంటి తెలంగాణా వార్తలు మన మీద రుద్దితే కుదరదు అని ఇలాంటి హైదరాబాద్ వార్తా పత్రికలకు ప్రజలే బుద్ధి చెప్పాలి...