సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు వీవీప్యాట్‌ ద్వారా ఏపీలో సుమారు 13 లక్షల పైచిలుకు ఓట్లను లెక్కించాల్సి ఉంటుందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది సోమవారం విలేకరులతో మాట్లాడుతూ స్పష్టంచేశారు. ఒక్కో పార్లమెంటు నియోజకవర్గం పరిధి లోని శాసనసభ నియోజకవర్గాల్లో మొత్తం 70 వీవీప్యాట్లను లెక్కింపు కోసం ర్యాండమ్‌గా ఎంపికచేస్తామని వివరించారు. ఆ తర్వాత తుది ఫలి తాలు వెల్లడి ఆలస్యమయ్యే అవకాశ ముందని చెప్పారు. ఓట్ల లెక్కింపు రోజున మధ్యాహ్నం 12 గంటలకే ఫలితాల సరళి తెలిసే అవకాశమున్నప్పటికీ తుది ఫలితాలు మాత్రం రాత్రి 12 గంటల వరకు సమయం పట్టే వీలుందని ద్వివేది స్పష్టంచేశారు.

ec 30042019

ఈవీఎంల లెక్కింపు పూర్తయ్యాక వీవీప్యాట్‌ స్లిప్పుల లెక్కింపు ప్రక్రియ చేపడతామని, అభ్యర్ధులు, ఏజెంట్ల సమక్షంలో వీవీప్యాట్‌ల ర్యాండమైజేషన్‌ ప్రక్రియను నిర్వహిస్తా మన్నారు. వీవీప్యాట్‌ స్లిప్పుల లెక్కింపు తో దేశ వ్యాప్తంగా ఫలితాలు వెల్లడిలో జాప్యం అనివార్యమని తెలిపారు. ఒక్కో అసెంబ్లి పరిధిలో ఐదు అసెంబ్లి, ఐదు లోక్‌సభ వీవీ ప్యాట్‌ యంత్రా ల్లోని స్లిప్పులను లెక్కిస్తామని చెప్పా రు. ఒక్కో వీవీప్యాట్‌లో సుమారు వెయ్యి ఓట్ల వరకూ పోల్‌ అయ్యే అవ కాశముందని ఆయన అంచనా వేశారు. రాష్ట్రవ్యాప్తంగా 1750 వీవీ ప్యాట్‌ స్లిప్పుల్ని లెక్కించాల్సి ఉంద న్నారు. మొదట అసెంబ్లి ఎన్నికల ఫలితాలను వెల్లడిస్తామని చెప్పారు. లోక్‌సభ ఫలితాల వెల్లడిలో కొంత జాప్యం జరిగే అవకాశముందన్నారు.

ec 30042019

సగటున ఒక్కో వీవీప్యాట్‌ ఓట్ల లెక్కింపు గంట నుండి గంటన్నర సమయం పట్టే అవకాశముందని తెలిపారు. ఒక్కో అసెంబ్లి నియోజకవర్గం పరిధిలో ఒక దాని తరువాత మరొక వీవీప్యాట్‌ స్లిప్పులను లెక్కింపును చేపడతామన్నారు. ఈవీఎంలలో పోలైన ఓట్లతో వీవీప్యాట్‌ స్లిప్పులు సరిపోయిన తరువాతే ఫలితాలను వెల్లడిస్తామని ద్వివేదీ స్పష్టంచేశారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు సీఈవో నో కామెంట్‌ అంటూ సమాధానం దాటవేశారు. కౌంటింగ్‌ ఏర్పాట్లపై సీఎస్‌ సమీక్ష వివాదాస్పదం అయిన అంశంపై విలేకరులు ఆయన దృష్టికి తీసుకురాగా సమాధానం చెప్పేందుకు నిరాసక్తత కనబర్చారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద నిఘా కెమేరాలు పనిచేయడంలేదనే ఆరోపణలపై కూడా ఆయన సమాధానం దాటవేశారు. ఈసీకి కలెక్టర్లు సహకరించడంలేదని వార్తలు వచ్చిన నేపథ్యంలో చర్యలు తీసుకునే అవకాశం ఏమైనా ఉందా అంటూ విలేకరులు ప్రశ్నించగా దానిపై కూడా ఆయన నో కామెంట్‌ అంటూ సమాధానమిచ్చారు. విలేకరుల సమావేశం సందర్భంగా సీఈవో తాను చెప్పదల్చుకున్న నాలుగు మాటలు చెప్పి వెళ్లిపోవడం గమనార్హం.

Advertisements

Advertisements

Latest Articles

Most Read