ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎప్పుడూ పర్యావరణం గురించి మాట్లాడుతూ ఉంటారు... అందరిలా మాటల్లో కాదు, చేతల్లో కూడా చేసి చూపిస్తున్నారు... ఇప్పటికే అమరావతిలో ప్రణాళికలు రచిస్తూ ఉండగా, తిరుమలలో మాత్రం ఆచరణలోకి తెచ్చేసారు... కాలుష్య రహిత తిరుమలకు తొలి అడుగు పడనుంది... తిరుమలకు వచ్చే ఆర్టీసీ బస్సులన్నీ విడతల వారీగా బ్యాటరీ బస్సులు కానున్నాయి... తిరుమలతో పాటు రాష్ట్రంలోని కీలకమైన రెండు నగరాలకు నడపాలని భావించింది. మొదటి విడతలో 1500 బస్సులు కావాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఆర్టీసీ బస్సుల స్థానంలో విద్యుత్తుతో నడిచే ఎలక్ట్రికల్‌ బస్సులను ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ఎలక్ట్రికల్‌ ఎఫిషియన్సీ సర్వీసు లిమిటెడ్‌ ఎండీ సౌరభ్‌కుమార్‌ గురువారం ప్రకటించారు.

tiruamala bus 29012018 2

బస్సులు తయారై రోడ్లపై తిరిగేందుకు సిద్ధంగా ఉన్నాయని.. వాటిని ఆంధ్రప్రదేశ్‌ అధికారులు తీసుకెళ్లాలని దిల్లీ నుంచి సమాచారం అందింది... తిరుమలలో వాహన కాలుష్యం ప్రమాదకర స్థాయిలో పెరిగిపోతోందని కాలుష్య నియంత్రణ బోర్టు గుర్తించింది. ముఖ్యంగా ఆర్టీసీ బస్సులే 60 శాతం కారణమని పేర్కొంది. దృష్టి పెట్టిన ప్రభుత్వం తిరుమలకు ఎలక్ట్రికల్‌ బస్సులు నడపాలని భావించింది. తిరుమలతో పాటు... విజయవాడ, విశాఖపట్నం నగరాల్లోనూ వీటిని నడిపాలని తలచి... కేంద్ర విద్యుత్తుశాఖ ఆధ్వర్యంలో నడిచే ఎలక్ట్రికల్‌ ఎఫిషీయన్సీ సర్వీసు లిమిటెడ్‌కు 1500 బస్సులు మొదటి ఫేజ్‌లో కావాలని తెలిపింది. గత సంవత్సరమే ఈ ప్రతిపాదన పెట్టగా.. ప్రస్తుతం బస్సులు సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్రప్రభుత్వానికి సమాచారం అందింది.

tiruamala bus 29012018 3

మొదటి ఫేజ్‌లో ప్రభుత్వం 1500 బస్సులకు ఆర్డరు ఇచ్చింది. దీనిలో ఎక్కువశాతం బస్సులను తిరుమలకే నడపాలని భావిస్తున్నారు. సుమారు 700 బస్సులు తిరుమలకు మొదటి ఫేజ్‌లో వచ్చే అవకాశం ఉంది. మొదటిదశలో వచ్చిన ఎలక్ట్రికల్‌ బస్సులు విజయవంతం అయితే రెండో దశలో మొత్తంగా ఆర్టీసీ బస్సులన్నీ ఎలక్ట్రికల్‌ చేయాలనేది ఆలోచన... 700 బస్సులని రాష్ట్రానికి తీసుకువచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు... బస్సుల్ని రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కొనుగోలు చేసి.. ఆర్టీసీ అప్పగిస్తారని అధికారులు చెబుతున్నారు. ఇక తిరుమలకు ఎలక్ట్రికల్‌ బస్సులు వస్తే... పాత వాహనాలు, కాలుష్యం వెదజల్లే వాహనాలను కొండపైకి నియంత్రించే ప్రణాళికను రూపొందిస్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read