ఏలూరు కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమ ఎజెండాలోని అంశాలపై చర్చలు జరపాలని వైసిపి  కార్పొరేటర్ మామహేశ్వరరావు డిమాండ్ చేసారు. దీంతో మేయర్ భర్త, కార్పొరేటర్ పెదబాబు, కార్పొరేటర్ మామహేశ్వరరావుపై తీవ్ర దూషణలకు పాల్పడ్డారు. ప్రతీ బుడబుక్కలోడు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన అవసరం తమకు లేదని ఆయన నోరు జారారు.  అంతే  కాకుండా  ఉమామహేశ్వరరావు ప్రసంగించడానికి వీల్లేదు అంటూ  వైసీపీ సభ్యులు అడ్డుపడ్డారు. దీంతో వారిరువురు మద్య తీవ్ర వాగ్వాదం జరిగింది.మరో వైపు , వీళ్ళు లంచాలు ఇచ్చిన వారికి మాత్రమే మాట్లాడటానికి  అనుమతి ఇస్తున్నారంటూ మున్సిపల్ కమిషనర్ పై వైసీపీ కార్పొరేటర్ హేమ సుందరి విరుచుకుపడ్డారు. దీంతో కార్పొరేషన్ కౌన్సిల్ హల్లో తీవ్ర గందరగోళ వాతావరణం నెలకొంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read