రాజకీయంగా, ఆర్థికంగా, పరిపాలనావిధానాల్లో విఫలమైన వైసీపీప్రభుత్వం, చివరికి పేదలకు మెరుగైన వైద్యసేవలందించడంలో కూడా ఘోరాతిఘోరంగా విఫలమైం దని, దానికి పెద్దఉదాహరణ ఏలూరు ప్రభుత్వాసుపత్రి ఘటనేనని టీడీపీనేత, ఎమ్మెల్సీ పీ.అశోక్‌బాబు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఏలూరుప్రభుత్వాసుపత్రి శవాగారం లోని మృతదేహం కళ్లను ఎలుకలు పీక్కుతినడం చూస్తుంటే, వైసీపీప్రభుత్వం ఆసుపత్రుల నిర్వహణను ఎంతచిత్తశుద్ధితో అమలుచేస్తోందో అర్థమవుతోందన్నారు. గతంలో చంద్రబాబుప్రభుత్వంలో పేదలఆరోగ్యాన్ని దృష్టిలోపెట్టుకొని దోమలపైయుద్ధం కార్యక్రమాన్ని ప్రకటిస్తే, అసెంబ్లీసాక్షిగా అవహేళనలు చేసిన మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, జరిగినఘటనపై ఏం సమాధానం చెబుతాడని అశోక్‌బాబు ప్రశ్నించారు. టీడీపీప్రభుత్వం ప్రజారోగ్యం కోసం విరివిగా నిధులుకేటాయించి, పారిశుధ్యనిర్వహణ, పెస్ట్‌కంట్రోల్‌ వంటిచర్యలను సమర్థవంతంగా నిర్వహించిం దన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో ఎలుకలు, బొద్దింకలు, దోమలనివారణకు నిధులు కేటాయించి చర్యలు తీసుకున్న టీడీపీప్రభుత్వాన్ని అపహాస్యం చేసిన వైసీపీ, నేడు అధికారంలోకి వచ్చాక ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసిందన్నారు.

చంద్రబాబు హాయాంలో జరిగినఘటనలు, ఆసుపత్రులనిర్వహణకు తీసుకున్నచర్యలను తప్పుపట్టిన వైసీపీమంత్రులు, ఏలూరు ఆసుపత్రి ఘటనకు బాధ్యతవహిస్తూ తక్షణమే రాజీనామా చేయాలని ఎమ్మెల్సీ డిమాండ్‌చేశారు. వైద్యరంగానికి అరకొరగా నిధులిస్తూ, ఆరోగ్యశ్రీని ఇన్సూరెన్స్‌ కంపెనీలకు అప్పగించిన జగన్‌సర్కారు, పేదలకు మెరుగైన వైద్యమందకుం డా మోకాలడ్డిందన్నారు. ప్రైవేటుఆసుపత్రులు ఆరోగ్యశ్రీరోగులకు మెరుగైన సేవలందిం చాలంటే, వాటికి సకాలంలో నిధులు అందాలని, ఇన్సూరెన్స్‌కంపెనీలు నిధులవిషయం లో కోతలుపెడుతుండటంతో, ప్రైవేటు యాజమాన్యాలు రోగులను నిర్లక్ష్యం చేస్తున్నాయ న్నారు. గతంలో వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి స్టార్‌హెల్త్‌ ఇన్సూరెన్స్‌కి అప్పగించడంవల్ల మెరుగైన వైద్యసేవలందక పేదలు నానాఇబ్బందులు పడిన విషయాన్ని జగన్‌సర్కారు గుర్తించాలని అశోక్‌బాబు సూచించారు.

చమురు, మద్యం, ఇసుకధరలుపెంచిన జగన్‌సర్కారు పేదలు, మధ్యతరగతివారికి చుక్కలుచూపుతోందని, వైద్యరంగంలోకూడా ఆయావర్గాలకు అన్యాయం జరిగేలా అరకొరగా నిధులు కేటాయిస్తోందన్నారు. మార్చి 2019 నాటికి పెండింగ్‌లో ఉన్న 9వేల ఆరోగ్యశ్రీ దరఖాస్తులకు తక్షణమే నిధులు కేటాయించాలన్నారు. ప్రజారోగ్యాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న వైసీపీప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా టీడీపీతరుపున పోరాటంచేస్తామని అశోక్‌బాబు హెచ్చరించారు. గత ప్రభుత్వం ఆమోదించిన సీఎమ్‌ఆర్‌ఎఫ్‌ నిధుల్ని కూడా నిలిపివేశారన్నారు. ప్రజారో గ్యంకోసం చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న చర్యలను తప్పుపట్టి, ఆయన్ని తూలనాడిన మంత్రులు, ముఖ్యమంత్రి ఏలూరులో జరిగిన ఘటనకు బాధ్యతవహిస్తూ తక్షణమే బహిరంగ క్షమాపణలు చెప్పాలన్నారు. మండలినిరద్దుచేసినా సభ్యులుగా తాము అమరావతి పోరాటాన్ని ఆపేదిలేదని, ప్రభుత్వం మండలిరద్దుతో పరిధిదాటిన నేపథ్యం లో, తాముకూడా తమపరిధులుదాటి రాజధాని కోసం పోరాటం చేస్తామని అశోక్‌బాబు స్పష్టంచేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read