ఏలూరులో ప్రజలు ఇబ్బందులు పడుతూ హాస్పిటల్ పాలు అవుతన్న సంఘటన జరిగి, ఇప్పటికి మూడు రోజులు అయినా, ఆ జబ్బు ఏమిటో, ఎందుకు వస్తుందో, అసలు ఏమి జరుగుతుందో, ప్రభుత్వం చెప్పలేక పోతుంది. నీళ్ళు బాగున్నాయి అంటారు, డ్రైనేజి వ్యవస్థ బాగుంది అంటారు, అన్నీ బాగున్నాయి, అంతా బాగుంది అంటారు, కానీ కారణం ఏమిటో మాత్రం చెప్పలేక పోతున్నారు. కొన్ని ప్రభుత్వ అనుకూల చానల్స్ ఒక అడుగు ముందుకు వేసి, ఏమి లేదు, ఇది మాస్ హిస్టీరియా అని తెల్చేసాయి. అంటే ప్రజలే ఒకరిని చూసి ఒకరు, ఇలా ఫిట్స్ వచ్చి పడిపోతున్నారని చెప్తున్నాయి. అయితే ఇప్పటికీ కారణం ఏమిటో తెలియకపోవటం, అలాగే రోజు రోజుకీ బాధితులు పెరిగిపోతూ ఉండటం, ఒక మరణం కూడా సంభవించటంతో, డబ్ల్యూహెచ్ఓ కూడా రంగంలో దిగింది. డబ్ల్యూహెచ్ఓ నుంచి డాక్టర్ భవాని అనే ప్రతినిధి, ఏలూరు వచ్చారు. గవర్నమెంట్ హాస్పిటల్ లో చికిత్స పొందతున్న వారి దగ్గరకు వెళ్లి వివరాలు సేకరించారు. అలాగే అక్కడ ఉన్న అధికారులు, కలెక్టర్, వైద్య అధికారులతో సమీక్ష చేసారు. కేసులు వివరాలు, ప్రజలు ఏ లక్షణాలతో ఇబ్బంది పడుతున్నారు, ఇప్పటి వరకు చేసిన రిపోర్ట్స్ ఏమిటి, వాటి ఫలితాలు ఏమిటి అనేదాని పై పూర్తిగా సమీక్ష చేసారు.
నీళ్ళలో ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పటంతో, కూరగాయల్ని కూడా టెస్ట్ చేయాలని ఆమె ఆదేశించారు. అంతే కాదు, వస్తున్నా పేషెంట్ల పై కూడా కొన్ని రకాల టెస్ట్ లు చేయాలనీ సూచించారు. ఏలూరు మొత్తం ఫాగింగ్ చేయాలని, గవర్నమెంట్ హాస్పిటల్ లో న్యూరాలజిస్ట్‌ను పెట్టాలని ఆదేశించారు. ఇక మరో పక్క మూడు రోజులు అయినా ఈ వ్యాధి తగ్గలేదు. మూడో రోజు కూడా వంద మందికి పైగా హాస్పిటల్ లో చేరారు. మొత్తంగా ఇప్పటి వరకు 450 మందికి పైగా ఈ వ్యాధి బారిన పడ్డారు. ఇప్పటికే ఎయిమ్స్ నుంచి కూడా ఒక బృందం వచ్చింది. అయితే ఇప్పుడ ఢిల్లీ నుంచి కేంద్రం ఒక బృందాన్ని పంపిస్తుంది. ఇక మరో పక్క ఈ ఘటన నేషనల్ మీడియాలోనే కాదు, ఇంటర్నేషనల్ మీడియాలో కూడా హైలైట్ అయ్యింది. అయితే డాక్టర్లు మాత్రం, నీటి కాలుష్యం వల్లనే ఇలా జరిగిందనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ, నీటిలో ఎక్కవగా బ్లీచింగ్ ఏమైనా కలిసిందా అనే దాని పై కూడా ఆరా తీస్తున్నారు. బ్లీచింగ్ ఎక్కువ మోతాదులో తీసుకుంటే, ఇలాంటి లక్ష్యణాలు ఉండే అవకాసం ఉంటుందని అంటున్నారు. ఏది ఏమైనా ఈ విషయం పై ఇప్పటికీ క్లారిటీ లేదు. మొత్తం మిస్టరీగానే ఉంది.