ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు ఎట్టకేలకు, ఉద్యమ బాట పట్టారు. ఇన్నాళ్ళు ఓర్పుగా రాష్ట్ర ప్రభుత్వంతో సమస్యల పరిష్కారం కోసం ఎదురు చూసి చూసి, ఇక మా వల్ల కాదు అంటూ, ఉద్యమ బాట పట్టారు. ఈ రోజు సమావేశం అయిన ఉద్యోగ సంఘాలు, ఉద్యమ కార్యాచరణ ప్రకటించాయి. ఏపీ జేఏసీ, అమరావతి, ఎన్జీవో జేఏసీ ఉద్యోగ సంఘాలు ఈ రోజు సమావేశం అయ్యి, తమ సమస్యల పరిష్కారం కోసం, ఉద్యమ బాట పట్టటానికి రెడీ అయ్యారు. ఆందోళన కార్యక్రమాల పై, డిసెంబర్ ఒకటో తేదీన, చీఫ్ సెక్రటరీకి నోటీసులు ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయం తీసుకునంరు. డిసెంబర్ 7 నుంచి 10 వరకు, ప్రభుత్వ తీరుకు నిరసనగా, నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరు కావాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే భోజన విరామ సమయంలో నిరసన తెలపటానికి ఉద్యోగ సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి. అలాగే డిసెంబర్ 13 నుంచి 15 వరకు, అన్ని మండల కేంద్రాల్లో ర్యాలీలు చేయాలని, సమావేశాలు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక డిసెంబర్ 16 నుంచి, మండల కేంద్రాల్లో సాయంత్రం వరకు ధర్నాలు చేయాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయాలు తీసుకున్నాయి. ఇక డిసెంబర్ 21 నుంచి 26 వరకు అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ధర్నాలు చేయాలని నిర్ణయాలు తీసుకున్నారు ఉద్యోగ సంఘాలు.

empoloyees 28112021 2

ఆ తరువాత డిసెంబర్ 27, 30, జనవరి 3, 6 తేదీల్లో విశాఖ, తిరుపతి, ఏలూరు, ఒంగోలులో భారీగా ప్రాంతీయ సమావేశాలు పెట్టాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి. ముఖ్యంగా పీఆర్సి నివేదిక ఇవ్వకుండా ప్రభుత్వం ఇబ్బందులు పెడుతున్న తీరు పై ఉద్యోగ సంఘాలు ఆగ్రహంగా ఉన్నాయి. పది రోజుల క్రితం ఈ విషయం పై సచివాలయంలో ధర్నా కూడా చేసారు. అయినా ప్రభుత్వం వైపు నుంచి స్పందన లేదు. ఒకటో తారీఖు జీతాలు ఇవ్వటం లేదని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక తాము దాచుకున్న పీఎఫ్ డబ్బులను కూడా దారి మళ్ళించారని ఆరోపిస్తున్నారు. ఇక రిటైర్ అయిన వారికి కూడా బెనిఫిట్స్ ఇవ్వటం లేదని, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీటి అన్నిటి పైనా, గత కొన్ని నెలలుగా ప్రభుత్వ అధికారులు చుట్టూ, ప్రభుత్వ పెద్దలు చుట్టూ తిరిగి తిరిగి అలిసిపోయామని, ఇక చేసేది ఏమి లేక, అందరం కలిసి చర్చించుకుని, ప్రభుత్వం పై ఉద్యమ బాట పట్టటానికి రెడీ అయ్యామని, ఉద్యోగ సంఘ నేతలు తేల్చి చెప్పారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read