ఎవరికైనా ఓర్పు నశించే వరుకే ఎంతైనా భరిస్తారు, ఓర్పు నశిస్తే, ఎవరు ఏంటి అనేది కూడా చూడరు. అందుకే ఎవరినా ఓర్పు నశించే దాకా తీసుకు రాకూడదు అంటారు. మొన్నటి ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డికి పూర్తిగా సహకారం అందించిన ఉద్యోగ వర్గాలు, రెండేళ్ళు తిరక్కుండానే లబో దిబో అనే పరిస్థతి వచ్చేసింది. నిజానికి 2014లో రాష్ట్ర విభజన జరిగే సమయానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మనుగడే కష్టం అవుతుందని అందరూ అనుకున్నారు. మనకు ఉన్న లోటు బడ్జెట్ తో పాటు, ఇతర అనేక సమస్యలతో, అసలు ఉద్యోగులకు జీతాలు ఇవ్వటమే గగనం అవుతుందని, ఏపి ఎలా నెట్టుకుని వస్తుందో అని అందరూ అనుకున్న సమయంలో, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు చూపించిన పరిపాలనదక్షతతో, ఈ సమస్యను అధిగమించారు. ఎక్కడా బ్యాలెన్స్ తప్పలేదు. ఎప్పుడూ ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా లేట్ చేయలేదు. కొన్ని కొన్ని ముఖ్య పండుగులప్పుడు అడ్వాన్స్ గా జీతాలు ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఇక పీఆర్సి, డీఏ, ఐఆర్, ఫిట్మెంట్ ఇవ్వన్నీ టైంకి ఇచ్చారు. ఏకంగా 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చి చంద్రబాబు ఆశ్చర్య పరిచారు. ఏ నాడు జీతాలకు లేట్ అవ్వలేదు. అయితే వివిధ కారణలతో, ప్రభుత్వ ఉద్యోగులు చంద్రబాబుని ఓడించారు, మూకుమ్మడిగా జగన్ ని గెలిపించారు.
అయితే జగన్ మోహన్ రెడ్డి వచ్చిన తరువాత ఆర్ధిక కష్టాలు ఎక్కువ అయ్యాయి. ఒకటి కాదు రెండు కాదు, అన్నీ సమస్యలే. ఈ నెల ఇప్పటికీ కొంత మంది ఉద్యోగులకు జీతాలు రాలేదు. ఏ నోటితో అయితే పొగిడారో, ఇప్పుడు అదే నోటితో జగన్ మోహన్ రెడ్డి పై ఉద్యోగులు విమర్శలు గుప్పిస్తున్నారు. సర్వీస్ రూల్స్ ప్రకారం బహిరంగంగా విమర్శలు చెయకూడదు కాబట్టి ఆగుతున్నారు. ఈ నేపధ్యంలో ఏపి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ రాష్ట్రంలో ఉద్యోగులు ఎదుర్కుంటున్న సమస్యల పై సంచాల వ్యాఖ్యలు చేసారు. ఇంత ధైర్యంగా ఆయన మాట్లాడటం పై చర్చ జరుగుతుంది. ఆయన తిరుమల దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడుతూ, రెండేళ్లుగా గుడుస్తున్నా ఉద్యోగులకు ఎలాంటి ప్రయోజనం లేదని, ఉద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని అన్నారు. ఉద్యోగులు అందరూ తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని, ఇప్పటికీ ఈ నెల కొంత మందికి జీతాలు రాలేదని అన్నారు. రిటైర్ అయిన వారికి, ఇప్పటికీ ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదని, అవే 3 వేల కోట్ల వరకు ఉన్నాయని అన్నారు. ప్రభుత్వం, ఈ సమస్యలు అన్నీ పరిష్కరించాలని అన్నారు.