మనకు తెలిసిన ప్రభుత్వ ఉద్యోగులు అంటే, మనల్ని లంచాల పేరుతో పీక్కుతినటం, ఒక పని చెయ్యటానికి వంద సార్లు మనల్ని తిప్పించుకోవటం, ఇలాంటి అభిప్రాయం మనకు ఉంది. అయితే, అందరూ ఇలాంటి వారు అని చెప్పటానికి లేదు. అన్ని వ్యవస్థల్లో మార్పులు వస్తున్నట్టే, ఉద్యోగుల్లో కూడా మార్పు వస్తుంది. అన్ని వ్యవస్థల్లో మంచి చెడు ఉన్నట్టే, ఇక్కడ కూడా చెడ్డ వారు ఉంటారు. అయితే, ఉద్యోగులు గురించి ఎప్పుడూ మాట్లాడుకునే మనం, వారు చేస్తున్న మంచిని కూడా మెచ్చుకోవాలి. తమకు జీతాలు పెంచినందుకు, మన రాష్ట్ర ఉద్యోగులు కొంత భాగాన్ని అమరావతికి ఇచ్చారు. తమకు విడుదల చేసిన పీఆర్సీ బకాయిల్లో 15 రోజుల వేతనాన్ని అమరావతి రాజధాని నిర్మాణానికి విరాళంగా ఇస్తున్నట్లు ఏపీ ఎన్‌జీవో జేఏసీ ఛైర్మన్‌ పి అశోక్‌ బాబు తెలిపారు. బుధవారం ముఖ్యమంత్రిని ఏపీ జేఏసీ నేతలు కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా అశోక్‌ బాబు మాట్లాడుతూ, ప్రస్తుతం ఇచ్చిన 15 రోజుల వేతనం విలువ సుమారుగా రూ. 200 కోట్లేమేర ఉంటుందన్నారు.

employees 28062018 2

ఈ మొత్తంతో రాజధాని నిర్మాణంకు అవసరమైన భవన సముదాయాల నిర్మాణాలకు వెచ్చించాలని కోరినట్లు తెలిపారు. అయితే, రాజధానిలోనిర్మించే ఏదో ఒక భవనానికి ఉద్యోగ సంఘ భవనంగా పేరు పెట్టాలని కోరామని, అందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారన్నారు. వెంటనే అక్కడే ఉన్న రాష్ట్ర మున్సిపల్‌ శాఖా మంత్రి పి నారాయణకు తగు విధంగా చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశాలు జారీచేశారని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జూన్‌ 2015న తిరుపతిలో జరిగిన సన్మానం సందర్భంగా ఇచ్చిన హామీ ప్రకారం 10వ పీఆర్సీ బకాయిలు చెల్లించినందుకు ధన్యవాదాలు తెలిపారు.

employees 28062018 3

సీసీఎస్‌ ఉద్యోగులకు మరియు పెన్షనర్‌లకు మూడు విడతలుగా సెప్టెంబరు, అక్టోబరు, నవరంబరు మాసాల్లో నగదురూపంలో చెల్లించే విధంగా ఉత్తర్వులిచ్చారన్నారు. దాదాపు 4 లక్షల మందికి పెన్షర్లు మరియు 4 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులకు మొత్తం 8 లక్షల మందికి ప్రయోజనం చేకూర నున్నట్లు ఆయన వెల్లడించారు. పీఆర్సీ చరిత్రలో ఇంత పెద్ద మొత్తము బకాయిలు చెల్లించడం ఇదే మొదటిసారన్నారు. షుమారు రూ. 3,940 కోట్లు మొత్తమును చెల్లిస్తారని చెప్పారు. 8 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యా పెన్షనర్లు బకాయిలు విడుదల చేసినందుకు హర్షం వ్యక్తంచేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read