ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వం మోసం చేసింది అంటూ, జీతాలు పెరగకుండా, తగ్గించిన పీఆర్సీ పై, ఉద్యోగులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఎలాగైనా ఉద్యోగులకు పెరిగిన పీఆర్సీ ప్రకారం జీతాలు ఈ నెలలోనే ఇచ్చేస్తే, చట్ట పరంగా బయట పడొచ్చని, ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో భాగంగానే డీడీవోలు, ట్రెజరీ ఉద్యోగుల పై, జీతాల బిల్లులు ప్రాసెస్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అయితే డీడీవోలు, ట్రెజరీ ఉద్యోగులు కూడా తాము కూడా నిరసనల్లో పాల్గుంటున్నామని, పాత జీతాల బిల్లులు అయితేనే ప్రాసెస్ చేస్తామని తేల్చి చెప్పారు. దీంతో ఇప్పుడు ప్రభుత్వం బెదిరింపు ధోరణికి దిగింది. వెంటనే ఉద్యోగుల జీతాలు ప్రాసెస్ చేయాలని, డీడీవోలు, ట్రెజరీ ఉద్యోగులను బెదిరిస్తుంది. లేదంటే, క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం అంటూ, మేమోలు జారీ చేసారు. ప్రభుత్వ విధులు ఆటంకం కలిగించారనే నెపంతో, చర్యలు తీసుకంటాం అని హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు ఆర్ధిక శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఆదివారం కూడా పని చేయాలని ఆదేశాలు ఇచ్చారు. అయితే అధికారులు మాత్రం, మేము చేసేది లేదని, కలెక్టర్లకు తెగేసి చెప్తున్నారు. దీంతో ప్రభుత్వం ఉద్యోగుల పై చర్యలకు దిగుతుంది అని ప్రచారం జరుగుతుంది. ఎస్మా ప్రయోగించినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. మరి ఈ సమస్య పరిష్కారం అవుతుందో, ముదురుతుందో చూడాలి.
క్రమశిక్షణ చర్యలు అంటూ, ఉద్యోగులకు షాక్ ఇచ్చిన ప్రభుత్వం ? ఎస్మా ప్రయోగానికి వెనుకాడరా ?
Advertisements