ఉద్యోగులు, టీచర్లు, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు చేస్తున్న చలో విజయవాడ ఉద్యమాన్ని, నిన్నటి నుంచి ప్రభుత్వం, పోలీసులు అణిచివేసే ప్రయత్నం చేసారు. ఎక్కడికక్కడ నిర్బందించారు. అయితే ఈ రోజు 9.30 వరకు అంతా పోలీసులు కంట్రోల్ లో , ప్రభుత్వం కంట్రోల్ లో ఉందని అందరూ భావించారు. అయితే ఉన్నట్టు ఉండి, అక్కడ నుంచి వచ్చారో కానీ, ఉద్యోగులు ఒకేసారి వేల మంది రోడ్డుల పైకి వచ్చేసారు. ఈ పరిణామంతో పోలీసులు షాక్ తిన్నారు. ఉద్యోగులను అడ్డుకోవాలని పోలీసులు చూసినా, ఎక్కడా వారి వల్ల కాలేదు. దీంతో పోలీసులు కూడా చేతులు ఎత్తేసారు. చేసేది ఏమి లేక చేతులు ఎత్తేయటంతో, ఉద్యోగులు తాము అనుకున్న విధంగా BRTS రోడ్డు వైపు, వేలాది మంది వెళ్తున్నారు. ఈ పరిణామంతో, పోలీసులు అవాక్కయారు. ప్రభుత్వం షాక్ తింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read