ఏపీ స‌ర్కారుతో హ‌నీమూన్ టైమ్ ముగిసిపోయిందంటున్నాయి ఉద్యోగ సంఘాలు. మొన్న‌టివ‌ర‌కూ మా ప్ర‌భుత్వం, అనుకున్నా ఆడుకున్నా మేమంతా ఒక్క‌టేనంటూ గారాలు పోయినా ఉద్యోగసంఘ నాయ‌కులు బాగానే బాగుప‌డ్డారు. అయితే ఉద్యోగుల్లో స‌ర్కారు తీరుప‌ట్ల ఆగ్ర‌హం పెల్లుబుకుతోంది. స‌ర్కారుతో లాలూచీ కోసం ఎంత మేనేజ్ చేసినా, ఆగేలా లేరు ఉద్యోగులు. దీంతో స‌ర్కారు ఉద్యోగ‌సంఘాలైన కాక‌ర్ల వెంక‌ట‌రామిరెడ్డి, ఎన్జీవో సంఘం బండి శ్రీనివాస‌రావు త‌ప్పించి మిగిలిన ఉద్యోగ సంఘాల‌న్నీ క‌లిపి ఉద్య‌మ కార్యాచర‌ణ ప్ర‌క‌టించాయి. రాజ‌శేఖ‌ర్ రెడ్డి బిడ్డా, నీపై మోజు తీరిపోయిందంటున్నాయి. ప్ర‌భుత్వం ఇచ్చిన హామీల అమ‌లు కోసం ప్ర‌శ్నిస్తే ఇబ్బందుల పాలు జేస్తున్నార‌ని, అందుకే ఉద్యమంలోకి దిగుతున్నట్లు ఏపీ జేఏసీ అమరావతి నేతలు ప్రకటించారు. సీఎస్ జవహర్ రెడ్డికి ఉద్యమ కార్యాచరణ నోటీసు అందజేశారు. మార్చి 9 నుంచి భవిష్యత్ కార్యాచరణ చేపడతామని ఇప్పటికే ఏపీ జేఏసీ అమరావతి నేతలు ప్ర‌క‌టించారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, లేకపోతే మార్చి 9 నుంచి యథావిధిగా ఉద్యమంలోకి దిగుతామని నేతలు పేర్కొన్నారు. నోటీసులో పేర్కొన్న  ప్ర‌కారం మార్చి 9, 10 తేదీల్లో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన, 13, 14 తేదీల్లో భోజన విరామ సమయంలో నిరసనలు, 15, 17, 20 తేదీల్లో జిల్లా కేంద్రాలు, కలెక్టరేట్‌ల దగ్గర ధర్నాలు, 21 నుంచి వర్క్‌టూ రూల్ అన‌గా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే పని చేయనున్నారు. మార్చ్ 21న సెల్‌డౌన్‌, యాప్‌డౌన్, 24 నుంచి అన్ని శాఖాధిపతుల కార్యాలయాల్లో ధర్నాలు, 27న కరోనాతో మృతిచెందిన ఉద్యోగుల కుటుంబాలకు ఓదార్పు కార్యక్రమం ఉంటుంది. సరెండర్-ఎర్న్‌ లీవ్‌లు, జీపీఎఫ్‌ విషయంలో ఏప్రిల్‌ 1న పోలీసు కుటుంబాల ఇళ్ళ సంద‌ర్శ‌న ఉంటుంది.  ఏప్రిల్‌ 5న ఏపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వ‌హించి రెండోదశ ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read