ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధనపై రాష్ట్ర ప్రభుత్వం కొంత మెత్తబడిన సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోని అన్ని పాఠ శాలలో 6వ తరగతి వరకు విధిగా ఆంగ్లమాధ్యమంలోనే బోధన చేయాలని జారీ చేసిన జీవోలో కొన్ని సడలింపులు చేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ లో ఈ విషయాన్ని వెల్లడించింది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలోనే విద్యాబోధన చేయాలని ప్రభుత్వం జారీ చేసినజీ వోను సవాల్ చేస్తూ డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ఆనే సామాజిక కార్యకర్త హైకోర్ట్ లో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ప్రభుత్వ ఉత్తర్వుల కారణంగా మాతృభాషలో విద్యాబోధన హక్కును కోల్పోవటంతో పాటు లింగ్విస్టిక్ట్ మైనారిటీస్ ' హక్కులను కాలరాసే విధంగా ఉన్నాయని పిటిషనర్ తన వ్యాజ్యంలో పేర్కొన్నారు. పిటీషనర్ తరుపున ప్రముఖ హైకోర్ట్ న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్ బాబు వాదించారు.

కేంద్రప్రభుత్వం తరపున వాదిస్తున్న అసిస్టెంట్ సాలిసిటర్ జనరల్ కృష్ణమోహన్ సైతం మాతృభాషలోనే విద్యాబోధన చేయాలన్న జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో ఈ కేసు విచారణ ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం వారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ట్ జితేంద్రకుమార్‌ మహేశ్వరీ, జస్టిస్ జయసూర్యలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. అందుకనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరాం కౌంటర్ దాఖలు చేశారు. ఇతర భాషలకు ఒకే... రాష్ట్ర ప్రభుత్వం హైకోర్ట్ కు దాఖలు చేసిన కౌంటర్‌లో లింగ్విస్టిక్ మైనారిటీ పాఠశాలల్లో ఉర్దూ, కన్నడ, తమిళ్, ఒరియా భాషలలో బోధనను కొనసాగించగలమని స్పష్టం చేసింది.

అంటే తెలుగు మినహా మిగిలిన అన్ని భాషలలో బోధనా యధావిధిగా కొనసాగేందుకు అవకాశమేర్పడింది. తెలుగు ఒక్కటే వద్దు అని చెప్పటంలో, ప్రభుత్వం ఉద్దేశం ఏమిటో మరి ? రాష్ట్రంలోని తల్లిదండ్రుల కమిటీలు అభిప్రాయాలు స్వీకరించామని, అత్యధిక శాతం మంది ఆంగ్ల భాషా బోధననే కోరుకుంటున్నారని ప్రభుత్వం కౌంటర్‌లో పేర్కొంది. ఒకవేళ ఎవరైనా తల్లిదండ్రులు తెలుగు మాధ్యమాన్ని కోరుకున్న పక్షంలో మండలానికి ఒక పాఠశాల ఏర్పాటు చేసేందుకు అభ్యంతరం లేదని ఆ కౌంటర్ లో తెలిపింది. దీనిపై విచారణను ఈ నెల 10వ తేదీకి వాయిదా వేశారు. ఇదే ‘ పిల్ 'లో ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్దిస్తూ మరో ఇరువురు ఇంప్లీడ్ అయ్యారు. విద్యా సంవత్సరం సైతం సమీపిస్తున్నందున ఈ 'పిల్ 'పై న్యాయమూర్తి నిర్ణయం కీలకం కానున్నది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read