బ్రతిమాలాం... భయపెట్టాం... కేసులు పెడతాం అని చెప్పాం.. కొడుకుని జైలు పాలు చేస్తాం అని బెదిరించాం... రాష్ట్రంలో రావణ కాష్టం చేస్తామని చెప్పాం... రాష్ట్రంలో రెండు పార్టీలని ఆధీనంలో ఉంచుకుని, ఇది మా బలం అని చంద్రబాబుకి చూపించాం... రాష్ట్రానికి రావలసిన డబ్బులు ఆపెస్తున్నాం... అమరావతిని ఇబ్బంది పెట్టాం... పోలవరం అడ్డుకుంటున్నాం... ఇన్ని చేస్తున్నా, చంద్రబాబు ఎందుకు లొంగటం లేదు ? ఏంటి చంద్రబాబు ధైర్యం ? మొన్న ఢిల్లీలో, నేషనల్ మీడియా ముందు ఉతికాడు... నిన్న తిరుపతిలో, వీడియోలు చూపించి మరీ వాయిస్తున్నాడు... ఇలా అయితే, ఎలా ? చంద్రబాబుని నిలువరించటం ఎలా ? ఇది ఢిల్లీ పెద్దలు పడుతున్న మదనం...
ఎన్ని ప్రయత్నాలు చేసినా, చంద్రబాబు మాత్రం చేసిన అన్యాయానికి రగిలిపోతున్నారు... అందరికీ అర్థమయ్యేలా అప్పటి ప్రధాని అభ్యర్థి మోదీ ప్రసంగ వీడియోలను ప్రదర్శించారు. గోవిందుడి సాక్షిగా ప్రధాని చేసిన బాసలను గుర్తు చేశారు. దిల్లీ చిన్నబోయేలా ఆంధ్రప్రదేశ్ రాజధానిని నిర్మిస్తామని, దేశ రక్షణ ఉత్పత్తుల కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దుతామని, విభజన చట్టంలోని ప్రతి అంశాన్నీ నూటికి నూరుశాతం అమలు చేస్తామని ప్రధాని మోదీ 2014 ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను చంద్రబాబు సభికులందరికీ వీడియోలద్వారా చూపించారు. అంతే కాదు, ఒక అడుగు ముందుకేసి, కర్ణాటక ఎన్నికల్లో మనకు అన్యాయం చేసిన వారిని ఓడించండి అని పిలుపు కూడా ఇచ్చారు చంద్రబాబు...
కేవలం ప్రత్యేక హోదా విషయమే కాదు.. పోలవరం, అమరావతి నిర్మాణం, విభజన చట్టం అమలు విషయాలను ఆయన లెక్కలతో సహా చంద్రబాబు వివరించే ప్రయత్నం చేశారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేసిన ప్రభుత్వ సంక్షేమ పథకాలను చెబుతూ.. అటు కేంద్రం నుంచి ఎలాంటి సాయం రాకపోవడాన్ని ప్రస్తావించారు. రాష్ట్రానికి కేంద్రం ఎంత సహాయం చేసిందో లెక్కలతో సహా చెప్పారు. ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికి ఇవ్వలేం... అని చెబుతూనే కొన్ని రాష్ట్రాలకు ఇవ్వడాన్ని ఆయన ఎత్తి చూపారు. ఇవన్నీ, ఢిల్లీ పెద్దలకు నచ్చటం లేదు.. చంద్రబాబు మరింత దూకుడుగా వెళ్తే, ఇబ్బందులు ఉంటాయనే విషయం వారే చెప్తున్నారు.. చంద్రబాబు వెంట ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారు, అనే విషయం గ్రహించి, ఇచ్చిన హామీలు నెరవేర్చండి, అని ఏపి ప్రజలు కోరుకుంటున్నారు...