ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్.. చంద్రబాబు ఉండగా ఈ పదం బాగా వినపడేది. చంద్రబాబు ఉన్న సమయంలో, పెట్టుబడి దారులకు స్వర్గధామంగా ఏపి ఉండేది. గుజరాత్, కర్ణాటక, తమిళనాడు లాంటి రాష్ట్రాలతో పోటీ పడి పెట్టుబడులు తెచ్చే వారు. దీనికి ప్రత్యేక్ష ఉదాహరణ కియా కంపెనీ. కియా, హీరో మోటార్స్, అపోలో టైర్స్, సెల్ కాన్, అశోక్ లేల్యాండ్, విఐటి, hcl, అదనీ డేటా సెంటర్, రిలయన్స్ జియో, జోహో, ఫ్రాంక్లిన్ టెంపుల్ టన్, ఇలా చెప్పుకుంటూ పోతే, బోలెడు కంపెనీలు వచ్చాయి. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వమే, చంద్రబాబు హాయంలో 5 లక్షలకు పైగా ఉద్యోగాలు వచ్చాయని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే అనేక పారశ్రామిక పాలసీలు తీసుకుని వచ్చి, చంద్రబాబు ఆ సమయంలో పెట్టుబడులను ఆకర్షించారు. దీని కారణంగానే, కేంద్ర ప్రభుత్వం ప్రకటించే ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్ లో, ఆంధ్రప్రదేశ్ ఎప్పుడూ మొదటి స్థానంలోనే ఉండేది. చంద్రబాబు గారు ఇచ్చిన బూస్ట్ తోనే, ఆ కాలానికి, జగన్ మోహన్ రెడ్డి గారు మొదటి ఏడాదిలో కూడా , ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ వన్ అవార్డ్ తీసుకున్నారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఈ రోజు సడన్ గా వైసీపీ సోషల్ మీడియా, ఒక ప్రచారం మొదలు పెట్టింది.
ఇందుకు కారణం ఇన్వెస్ట్ ఇండియా అనే కేంద్ర సంస్థకు చెందిన ట్విట్టర్ హ్యాండిల్ లో, అన్ని రాష్ట్రాల బలా బలాల గురించి చెప్తూ, ట్వీట్లు వేస్తున్నారు. ఏపికి వచ్చే సరికి, మనకు గతంలో ఇచ్చిన ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంక్ గురించి ప్రస్తావించారు. అందులోనే మనకు వచ్చిన పెట్టుబడులు కూడా పెట్టారు. ఇంకేముంది, మళ్ళీ ఏపికి ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ లో ఫస్ట్ వచ్చిందని, దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే, మనకే ఎక్కువ పెట్టుబడులు వచ్చాయి అంటూ, డబ్బా కొట్టటం మొదలు పెట్టారు. నిజానికి పెట్టుబడులు ఆకర్షించటంలో మనం పెట్టుబడుల్లో 14 వ స్థానంలో ఉన్నాం. ఇక కోవిడ్ కారణంగా, గత ఏడాది కేంద్రం ఎటువంటి EODB ర్యాంకులు వ్వలేదు. 2019-20లో చంద్రబాబు గారి హయాంలో ఇచ్చిన దానికి, ఇప్పుడు ఫేక్ ప్రచారం సెహ్స్తున్నారు. Invest India వాడు విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం కోసం పాత (2019) ర్యాంకింగ్స్ వేశాడు. అవి చూసి వైసీపీ పైడ్ బ్యాచ్, పేటీయం బ్యాచ్, బ్లూ మీడియా, కనీసం వెరిఫై చేసుకోకుండా చిడతలు వాయిస్తున్నారు. అయినా, ఇక్కడ నుంచి పెట్టుబడులు అన్నీ వెళ్ళిపోయి, మటన్ షాపులు, చేపలు కొట్లు వస్తుంటే, ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ అంటారేంటి ? ఏమి లేని దానికి, జాకీలు వేసుకుని లేపటం ఎందుకు ?