ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్... గత రెండు సంవత్సరాలుగా, ఆంధ్రప్రదేశ్ ఎప్పుడూ ఫస్ట్ వస్తుంది... దేశంలో అన్ని రాష్ట్రాల కంటే, మన రాష్ట్రం ఫస్ట్ ఉంటూ వస్తుంది... కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన 340 అంశాలను పరామీటర్స్ గా తీసుకుని, ర్యాంకింగ్స్ ఇస్తారు... ఈ సంవత్సరం కూడా, ఈ ర్యాంకింగ్స్ ఇవ్వనున్నారు... ఈ పరామీటర్స్ అన్నీ రాష్ట్ర ప్రభుత్వాలు వెబ్సైటులో (http://eodb.dipp.gov.in/) అప్డేట్ చెయ్యాలి... కేంద్ర ప్రభుత్వం, ప్రతి రాష్ట్రం అప్డేట్ చేసిన వాటిని ఇవాల్యువేట్ చేసి, ర్యాంకింగ్స్ ప్రకటిస్తుంది... ఈ ప్రాసెస్ ఇంకా జరుగుతూనే ఉంది...

eodb 22012018 2

కాని నవంబర్ నెలలో, హైదరాబాద్ మీడియా హంగామా హంగామా చేసింది... ర్యాంకింగ్స్ ప్రకటించకుండానే, తెలంగాణా ఫస్ట్ అని, ఆంధ్రప్రదేశ్ 14వ స్థానంలో ఉంది అని ఊదరగొట్టింది... చివరకు ఈనాడు కూడా అలాగే రాసింది... తెలంగాణా ప్రభుత్వం ఇచ్చిన బ్రీఫింగ్ తీసుకుని, విషయం తెలుసుకోకుండా, ఆంధ్రప్రదేశ్ ఎక్కడో ఉంది అంటూ హేళన చేసారు.. అయితే, ఇప్పటికే ఇవాల్యువేషన్ జరుగుతూనే ఉంది... ప్రస్తుతం ర్యాంకుల బట్టి, ఆంధ్రప్రదేశ్ నాలుగువ స్థానంలో ఉంటె, తెలంగాణా 6వ స్థానంలో ఉంది... మొదటి స్థానంలో జార్ఖండ్ ఉంది... అయితే ఇవి ఇంకా ఫైనల్ కాదు...

eodb 22012018 3

ర్యాంకులు ప్రకటించే సమయానికి, ఆంధ్రప్రదేశ్ కచ్చితంగా మొదటి స్థానంలో ఉండి తీరుతుంది... నిజానికి రాష్ట్రానికి సంబంధించిన పరామీటర్స్ అన్నీ సబ్మిట్ చెయ్యటానికి నవంబర్ 7, 2017 చివరి తేది... కాని తెలంగాణ మీడియా మాత్రం నవంబర్ 1 నే, తెలంగాణా ఫస్ట్ అంటూ ప్రకటించింది... నవంబర్ 7 తరువాత అన్ని పరామీటర్స్ ఇవాల్యువేట్ చేస్తున్నారు... ఇప్పటి వరకు మనం నాలుగవ స్థానంలో ఉన్నాం, తెలంగాణా 6వ స్థానంలో, మనకంటే రెండు స్థానాలు వెనకబడి ఉంది... చివరకు ర్యాంకింగ్స్ ప్రకటించే రోజు మనకు ఫస్ట్ ర్యాంక్ వస్తుంది... ఇది తధ్యం... అప్పుడు ఈ తెలంగాణా మీడియా ఆర్తనాదాలు విందాం...

Advertisements

Advertisements

Latest Articles

Most Read