మన రాష్ట్రంలో ఒకాయన చంద్రబాబుని కాల్చి పడేసి బంగాళాకాతంలో పడేయమంటాడు.. కొత్తగా బయలుదేరిన ఇంకో ఆయన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండటం మా ఖర్మ అంటాడు.... చంద్రబాబు లాంటి గ్లోబల్ లీడర్ కి, ఇలాంటి వాళ్ళతో మాటలు పడుతున్నారు అంటే, నిజంగా ఆయన జీవితం ఏంటో ఇలా ఉంది అనుకోవటం తప్ప, ఏమి అనలేము... చంద్రబాబు గ్లోబల్ లీడర్ ఏంటి, అని అనే వాళ్ళు కూడా ఉంటారు... ఆయన గ్లోబల్ లీడర్ ఎందుకు అయ్యారో, బిల్ గేట్స్ ని అడగండి, బిల్ క్లింటన్ ని అడగండి, సిస్కో చైర్మెన్ ని అడగండి, ప్రపంచంలోని టాప్ మోస్ట్ బిజినెస్ మెన్ వచ్చే దావోస్ కి వెళ్లి, ఎవర్ని అయినా అడగండి చెప్తారు, చంద్రబాబు గ్లోబల్ లీడరో కాదో... వీళ్ళని అడగటం అంత ఇబ్బంది అనుకుంటే, ఐక్యరాజ్యసమితి ఎన్విరాన్‌మెంట్‌ హెడ్ ఎరిక్ సోలెన్ లేటెస్ట్ గా ఏమంటున్నారో వినండి...

erik 03062018 2

యునైటెడ్ నేషన్స్, అంటే ఐక్యరాజ్యసమితి...అలాంటి ఐక్యరాజ్యసమితి ఎన్విరాన్‌మెంట్‌ హెడ్ ఎరిక్ సోలెన్,మన రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి ఏమని ట్వీట్ చేసారో తెలుసా... "చంద్రబాబు నోటి వెంట ఇన్స్పైరింగ్ వర్డ్స్ వింటున్నా.. రియల్ టైం గవర్నెన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అగ్రికల్చర్, నాలెడ్జ్, అన్నీ కలిస్తేనే, ఈ ప్రపంచం ముందుకు వెళ్తుంది.. ఇన్స్పైరింగ్ అంటూ" ట్వీట్ చేసారు... అంతే కాదు ఐక్యరాజ్యసమితి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కలిసి, ప్రకృతి వ్యవసాయం కోసం పని చేస్తున్నారు. దీని పై కూడా ట్వీట్ చేసారు. "Good to meet the Chief Minister of Andhra Pradesh @ncbn to discuss the state’s ambitious natural farming plans. @UNEnvironment is delighted along with partners, to support this bold initiative to protect climate, biodiversity and ensure food security "

erik 03062018 3

రెండు రోజులుగా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట బైబిల్‌ మిషన్‌ మహాసభల ప్రాంగణంలో ప్రకృతి సేద్యం శిక్షణ తరగతులు పెద్ద ఎత్తున జరిగాయి. ఇందులో క్యరాజ్యసమితి ఎన్విరాన్‌మెంట్‌ హెడ్ ఎరిక్ సోలెన్ కూడా పాల్గున్నారు. ఆయన అక్కడ కూడా మాట్లాడారు ‘‘ప్రకృతి సేద్యం విషయంలో చంద్రబాబు ఆలోచనలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ విధానానికి తన దావోస్‌ పర్యటనలో ఆయన అమిత ప్రాధాన్యతని ఇచ్చారు. అక్కడ జరిగిన సదస్సులో ఈ ఉత్పత్తుల మార్కెటింగ్‌, నాణ్యత తదితర అంశాలపై అంత ర్జాతీయ వ్యాపార సంస్థలను కదిలించడానికి ప్రయత్నించారు. పవర్‌పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ద్వారా ఎక్కువ కంపెనీలను ఆకర్షించగలిగారు’’ అని ఐరాస ఉపాధి కల్పన విభాగం ఉన్నతాధికారి ఎరిక్‌సోలెన్‌ కొనియాడారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read