అమరావతి గురించి ఇంకా మర్చిపోవచ్చు అనుకుంటున్న ఆంధ్రులకు, మరో షాకింగ్ న్యూస్. ఇప్పటికే అమరావతి పై ప్రపంచ బ్యాంక్ నుంచి కేంద్రం దాకా అందరూ తప్పుకోగా, తాజాగా సింగపూర్ ప్రభుత్వం కూడా, అమరావతికి గుడ్ బాయ్ చెప్పేసింది. అమరావతి ప్రాంతంలో, ప్రధాన ప్రాజెక్ట్ అయిన, స్టార్టప్‌ ఏరియా ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాలని సింగపూర్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిజానికి సింగపూర్ ప్రభుత్వం డైరెక్ట్ గా చేసే ప్రాజెక్ట్ కాబట్టి, ఈ ప్రాజెక్ట్ పై అందరికీ ఆశలు ఉన్నాయి. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని, ఈ ప్రాజెక్ట్ పూర్తీ చేస్తుందని అందరూ అనుకున్నారు. అయితే, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అమరావతి పై ఉన్న అనాసక్తి గమనించిన సింగపూర్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునట్టు తెలుస్తుంది. స్టార్టప్‌ ఏరియా నుంచి తప్పుకుంటున్నట్టు, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సింగపూర్ ప్రభుత్వం కబురు పంపించింది.

singapore 05092019 2

అమరావతి మాస్టర్‌ ప్లాన్‌ తాయారు చెయ్యటం దగ్గర నుండి, అమరావతి అభివృద్ధికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, సింగపూర్‌ దేశ ప్రభుత్వాలు, సంస్థల మధ్య చాలా ఒప్పందాలు జరిగాయి. ఇవన్నీ చెయ్యటంలో సింగపూర్ మంత్రి ఈశ్వరన్‌ కీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంలో, సింగపూర్ పార్లిమెంట్ లో, అమరావతి గురించి చెప్తూ, సింగపూర్ ప్రభుత్వం అమరావతిలో చేపట్టబోయే స్టార్టప్‌ ఏరియా ప్రాజెక్ట్‌ గురించి మంగళవారం సింగపూర్ పార్లమెంటులో ప్రకటన చేశారు. అమరావతిలో జరుగుతున్న పరిణామాలు గమనిస్తున్నాం అని చెప్పారు. ఇప్పుడున్న పరిస్తితుల్లో అమరావతిలో పెట్టుబడి పెట్టటం పై ఆలోచిస్తున్నాం అని తెలిపారు. అలాగే ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం, అమరావతి పై చూపిస్తున్న అనాసక్తి గురించి కూడా వివరణ ఇచ్చారు.

singapore 05092019 3

అదే సమయంలో అమరావతి నుంచి ప్రపంచ బ్యాంక్ తప్పుకోవటం, అలాగే ఏఐఐబీ సైతం రూ.1500కోట్ల రుణ ప్రణాళికను పక్కనపెట్టడం వంటి పవిషయలు ఈశ్వరన్‌ ప్రస్తావించినట్లు తెలిసింది. ఈశ్వరన్ ఇచ్చిన వివరణ చూస్తే, స్టార్టప్‌ ఏరియా అభివృద్ధి ప్రణాళిక నుంచి సింగపూర్‌ కన్సార్షియం తప్పుకోనున్నట్లు ఆయన చెప్పినట్టే అయ్యింది. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత కూడా, సింగపూర్ ప్రతినిధులు వచ్చి ఆయన్ను కలిసి, అమరావతి పై తమ ప్రణాళికను వివరించారు కూడా. అయినా సరే జగన్ మోహన్ రెడ్డి అమరావతి పై ఆసక్తి చూపించకపోవటంతో, సింగపూర్ ప్రభుత్వం కూడా ఆలోచనలో పడినట్టు తెలుస్తుంది. మొత్తానికి, ఇక అమరావతి పరిస్థితి ఏంటో, ఆ దేవుడే చెప్పాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read