వార్‌ రూమ్‌లు.. యుద్ధ విమానంలో రాష్ట్ర విభజన బిల్లు... పార్లమెంట్‌ తలుపులు మూసి, టీవీలు ఆపి విభజనచేశారు... పొట్టకొట్టి పంపారు.. కట్టుబట్టలతో నెట్టారు... ఆస్తులు ఇవ్వలేదు.. అప్పులు నెత్తిన పెట్టారు.... ఇటలీ స్వాతంత్య్ర దినోత్సవం రోజే మన విభజన రోజు... మన పొట్టకొట్టిన రోజు... మనల్ని బజారుల్లోకి నెట్టిన రోజు.. ఇదే జూన్ 2... ఈ రోజు ప్రతి ఆంధ్రుడు గుర్తు పెట్టుకోవాలి.... కసితో లాగి లాగి కొట్టాలి....

కట్టుబట్టలతో మనల్ని బయటకు పంపించారు. ఆస్తులు వాళ్లకిచ్చారు. అప్పులు మన నెత్తి మీద రుద్దారు. ఇద్దరు అన్నదమ్ములు విడిపోయినప్పుడు తల్లిదండ్రులు, పెద్దమనుషులు కూర్చొని ఆమోద యోగ్యమైన విధంగా పంపకాలు చేస్తారు. కానీ... కాంగ్రెస్‌ పార్టీ మాత్రం ఎవర్నీ అడగకుండా... సొంతంగా ఆలోచన చేసి విభజన చేసింది. 60ఏళ్లపాటు హైదరాబాద్‌ను అభివృద్ధిచేసుకుంటే... కట్టుబట్టలతో, నెత్తిమీద అప్పులతో బయటకు పంపారు. మీకు అండగా ఉంటామన్న మాట కూడా చెప్పకుండా విభజించారు. నిధులు లేవు. రాజధాని లేదు. మోడీ ప్రభుత్వం మనల్ని ఆశించిన విధంగా ఆదుకోకపోయినా, మూడున్నర ఏళ్ళు సర్దుకుపోవాల్సిన పరిస్థితి. కాని కేంద్రం ఆదుకోకపోగా, హేళన చేస్తుంది. మీకు మయసభలు కావాలా అంటూ ఎగతాళి చేస్తుంది. ఇప్పుడు ఈ ఢిల్లీ పార్టీతో కూడా పోరాడాల్సిన పరిస్థితి.

ఎన్నో కష్టాలతో ప్రయాణం మొదలైంది... కానీ, దాన్ని తలచుకుంటూ కూర్చోలేదు. విభజన తర్వాత కాంగ్రెస్‌ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించి.. డిపాజిట్లు లేకుండా చేశాం. ఒక ప్రణాళిక ప్రకారం వెళ్ళాం, ముందుగా ఒక నాయకుడుని ఎన్నుకున్నాం. ఆయన నాయకత్వం లో పురోగమించటమే లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆంధ్రుడు పైకి, ఏం పట్టనట్టు ఉంటారు, కానీ, వీళ్ళు వేసే ప్రతి అడుగు బలంగా భూభనోంతరాలు దద్దరిల్లేలా ఉంటుంది.  రాజధాని కూడా లేకుండా, చేసినచోటే, ప్రపంచస్థాయి నగరాన్ని నిర్మించుకొంటున్నాం. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ దేశం మొత్తం మీద పెట్టుబడులు ఆకర్షించటంలో ప్రధమస్థానంలో ఉంది. విద్యుత్తు లో మొదటి స్థానంలో ఉంది. స్వఛ్ఛనగరాలలో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది....ఇలా, ఒకటి కాదు, రెండు కాదు...అన్నిట్లో ప్రధమస్ధానమే లక్ష్యంగా దూసుకెళ్తుంది. గుర్తుపెట్టుకోండి, రానున్న దశాబ్దం మనదే !! ఆ దశాబ్దంలో విజేతలుగా ఎదుగుతాం, పదిశతాబ్దాలు మనమే ఆ స్థానంలో ఉంటాము. 

ఇప్పుడు సొంత రాష్ట్రం నుంచే మనకు శత్రువులు తయారు అయ్యారు. మన రాష్ట్రం బాగుపడుతుంది అంటే ఏడుపు... అమరావతిలో అభివృద్ధి జరుగుతుంది అని చెప్తే ఏడుపు.... పలానా జిల్లాలో అభివృద్ధి జరుగుతుంది అని చెప్తే సన్నాయినొక్కులు... పలానా ప్రాజెక్ట్ వస్తుంది అంటే నిట్టూర్పులు... పలానా కంపెనీ రాష్ట్రంలో పెట్టుబడి పెడుతుంది అంటే ఎగతాళి... మీకు రాష్ట్రం ముఖ్యం, అది గుర్తుపెట్టుకోండి... వెనకటకి ఎవడో, చెరువు మీద అలిగి, ఎదో చెయ్యలేదు అంట... ప్రభుత్వం సక్రమంగా చేసే ప్రతి పనిని ఎగతాళి చేస్తే, నీ రాష్ట్రాన్ని, నీ ప్రాంతాన్ని, నీ జిల్లాని, నీ ఊరిని, నువ్వే ఎగతాళి చేస్తున్నట్టు, అనే చిన్న లాజిక్ మర్చిపోతున్నాం....ఇలాంటి మనస్తత్వం ఉన్నవాళ్లు తెలుసుకోవాల్సింది, ఆంధ్రవాడికి జరిగింది అన్యాయం కాదు, అవమానం... ఆ గాయాలు నుంచి, ఇప్పుడు ఇప్పుడే బయటపడుతున్నాం... ఉన్మాదుల లాగా, మానుతున్న గాయాన్ని, మళ్లీ పెద్దది చెయ్యకండి.... తగిలన చోట, మళ్ళి కొడితే, చిన్న దెబ్బ అయినా, తట్టుకోలేని నొప్పి ఉంటుంది...

సీమాంధ్ర పొట్టకొట్టి, తీవ్ర అన్యాయం చేసిన కాంగ్రెస్‌ నాయకులు అసూయపడేలా, నమ్మించి మోసం చేసిన బీజేపీ పార్టీ దిమ్మ తిరిగేలా మనం తిరుగులేని శక్తిగా ఎదగాలి. ఆ నాయకులు కుమిలి కుమిలి ఏడ్వాలి. మనల్ని అవహేళన చేసిన వారికి మన దమ్ము చూసి, మైండ్ బ్లాక్ అవ్వాలి... మనం కులం, మతం, ప్రాంతం పక్కన పెట్టి, రాష్ట్రం కోసం నిరంతరం పని చెయ్యాలి... ఇందుకు చంద్రబాబు ఒక్కడే కసిగా పని చేస్తే సరిపోదు. మనందరిలో కూడా కసి పెరగాలి. కక్ష పెరగాలి. నవ్యాంధ్ర స్వర్ణాంధ్రగా మారేదాకా ఈ కక్ష, కసి కొనసాగాలి...

నెడితే పడిపోవటానికి.. మనం నడుములు వంగిన ముసలోళ్లం కాదు..
విడగొడితే విలపించడానికి.. మనం ఆశలు ఎండిన సన్నాసులం కాదు..

కట్టుబట్టలతో వెల్లగొడితే కన్నీళ్లు పెట్టుకోవటానికి..కసి లేని..పౌరుషం లేని జీవులం కాదు..
నడిరోడ్డులోకి నెట్టేస్తే ..ఇప్పుడెలా అని దిక్కులు చూసే అమాయకత్వం మనకు లేదు..

అసలు దారే లేని చోట రహదారులు పరుస్తాం..
నలుగురుకి ఆదర్శం గా నిలుస్తాం...

చిమ్మ చీకట్లు అలుముకున్నా..చీల్చుకు వస్తాం..
తోటి ప్రపంచానికి కాంతి రేఖై వెలుగినిస్తాం..

నవ నాగరికతకి నాంది మనం..
ఉదయించే సూర్యుడే మనకు స్ఫూర్తి..

తిరుగులేదు నీకు ఆంధ్రుడా...
నీ యశస్సే ఈ దేశానికి వెలుగు నీడ..

జై అమరావతి... జై జై ఆంధ్రప్రదేశ్...

Advertisements

Advertisements

Latest Articles

Most Read