సిఐడి మాజీ డీజీ సునీల్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, డీజీపీ రాజేంద్ర నాద్ రెడ్డికి నిన్న లేఖ రాసారు. సిఐడి డీజీగా సునీల్ కుమార్ ఉన్న సందర్భంలో అక్రమ నిర్బంధాలు, తెలుగుదేశం పార్టీ నేతల పై అక్రమ కేసులు, థర్డ్ డిగ్రీ ప్రయోగంతో పాటుగా, సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుకి వ్యతిరేకంగా పలు నిబంధనలను ఉల్లంఘిస్తూ, చట్టం, రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘించారు అని, ఎంపీ రఘురామరాజుతో పాటు పలువిరి పై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని, కేంద్ర హోంశాఖకు లాయర్ గూడపాటి లక్ష్మీనారాయణ ఫిర్యాదు చేసారు. ఈ ఫిర్యాదు పై స్పందించిన కేంద్ర హోంశాఖ, ఈ నెల 3న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసి, సునీల్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. కేంద్రం ఇచ్చిన ఆదేశాలు ప్రకారం, చీఫ్ సెక్రటరీ నిన్న డీజీపీకి లేఖ రాసి, వెంటనే నిబంధనలు ప్రకారం సునీల్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. అయితే ఇప్పటికే సునీల్ కుమార్ ని సిఐడి డీజీ నుంచి తప్పించి, ప్రసుత్తం ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా ఉంచిన సంగతి తెలిసిందే. అయితే, నిబంధనలు అతిక్రమించిన ఎవరైనా, చివరకు ఇలా బలి అవ్వాల్సిందే అనే దానికి ఇది మరో ఉదాహరణ

Advertisements

Advertisements

Latest Articles

Most Read