అవిశ్వాసం పెట్టిన దగ్గర నుంచి, ఒకటి తరువాత ఒకటి, ఎదో ఒక సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఒకరి తరువాత ఒకరు, వచ్చి డైవర్ట్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. రెండు రోజుల నుంచి పవన్ కళ్యాణ్ చేస్తున్న హడావిడి చూస్తూనే ఉన్నాం. కాల్చండి, చంపండి, 144 సెక్షన్ పెట్టండి అని, ఇలా నోటికి ఏది వస్తే అది మాట్లాడేసి, ప్రజలను రెచ్చగొట్టి, అవిశ్వాసం తదనంతర పరిణామాలు డైవర్ట్ చెయ్యటంలో, మోడీని కాపాడటంలో బిజీగా ఉన్నారు. గల్లా, రామ్మోహన్ నాయుడుల స్పీచ్ గురించి, దేశమంతా మెచ్చుకుంటే, మనోడు మాత్రం వీక్ గా ఉంది అంటూ తీసి పడేసాడు. ఇప్పుడు, మరో వ్యక్తి కూడా తయారయ్యాడు. నేను రైతు సమస్యల పై అధ్యయనం చేస్తున్నా అని చెప్తూ, రైతు నేత అనో ఏమో కాని, ఈ రోజు ముద్రగడను కలిసారు. ఈ భేటీ పై విమర్శలు వినిపిస్తున్నాయి.
జేడీ లక్ష్మీనారాయణ. రాష్ట్ర రాజకీయాల్లో పోషించబోయే పాత్ర గురించి కొంత ఉత్కంఠ నెలకొంది. ఈ రోజు కిర్లంపూడి వెళ్లి మరీ మర్యాద పూర్వకంగా ముద్రగడను కలిశారు. మారుమూల గ్రామం పనిగట్టుకొని వెళ్లి మర్యాద పూర్వకంగా కలిసేటంత ఉన్నత విలువలు ముద్రగడ లో ఏ మాత్రం ఉన్నాయో అందరికీ తెలుసు. ట్రైన్ లు తగలబెట్టే చరిత్ర ఉన్న ముద్రగడను, ఒక సమర్ధవంతమైన ఆఫీసర్ గా పేరు ఉన్న ఆయన కలవటం ఏంటో అర్ధం కాలేదు. దీంతో వచ్చిన క్లారిటీ ఏంటంటే ఈయన జెండా ఏదైనా ఎజెండా మాత్రం చంద్రబాబు ఓటమి. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఒక్కో పాత్ర రంగప్రవేశం. అహర్నిశలు రాష్ట్రం కోసం పనిచేసే ఒక ముఖ్యమంత్రి ని ఓడించటానికి ఇంతమంది ఏకమవ్వటం చూస్తుంటే, ఎలాంటి రాజకీయం చేస్తున్నారో అర్ధమవుతుంది. ముద్రగడతో , మోత్కుపల్లి భేటీ అవ్వటం.. ముద్రగడతో ఐవైఆర్ భేటీ అవ్వటం.. ముద్రగడతో విజయసాయి భేటీ అవ్వటం.. ముద్రగడతో, లక్ష్మీనారాయణ భేటీ అవ్వటం... ఏంటో ఇవన్నీ...