వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో మొట్టమొదటిసారిగా ఆయన సతీమణి భారతిపై అభియోగాలు నమోదయ్యాయి. భారతీ సిమెంట్స్‌లో క్విడ్‌ప్రో కో పద్ధతిలో జరిగిన పెట్టుబడుల వ్యవహారంలో జగన్‌తోపాటు భారతిని కూడా నిందితురాలిగా చేరుస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సీబీఐ ప్రత్యేక కోర్టులో ఇటీవల అభియోగ పత్రం (చార్జిషీటు) దాఖలు చేసింది. అయితే, వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో కీలకంగా వ్యవహరించిన సీబీఐ మాజీ జాయిండ్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ.. వైఎస్ భారతిపై కేసు గురించి స్పందించారు.
విశాఖపట్నం జిల్లా చోడవరంలో ‘విద్యార్థులను తీర్చిదిద్దడం ఎలా?’ అనే అంశంపై ఉపాధ్యాయులకు శిక్షణా శిబిరాన్ని నిర్వహించారు. వైఎస్ భారతిపై ఈడీ కేసు గురించి ఈ సందర్భంగా లక్ష్మీనారాయణను విలేకరులు ప్రశ్నించగా.. ‘‘జగన్ సతీమణి భారతిపై ఈడీ కేసు గురించి నాకేం తెలియదు.’’ అని బదులిచ్చారు. సీనియర్, డైనమిక్ ఐపీఎస్ అధికారి అయిన లక్ష్మీనారాయణ ఇటీవల తన పదవికి రాజీనామా చేసి, రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ సమస్యలు తెలుసుకుంటున్నారు.
మరో పక్క ఈడీ తన భార్య పై కేసు పెడితే, జగన వచ్చి తెలుగుదేశం పార్టీని విమర్శించటం, ఇక్కడ కూడా కనీసం మోడీని ఒక్క మాట కూడా అనకపోవటంతో, తెలుగుదేశం మండిపడుతుంది. జగన్ బహిరంగ లేఖకు రాష్ట్ర మంత్రి యనమల రామకృష్ణుడు స్పందించారు. ఈ కేసు విషయంలో జగన్ వాదన విచిత్రంగా ఉందని వ్యాఖ్యానించారు. కేసులో కుటుంబసభ్యుల ప్రమేయం ఉందో, లేదో జగన్ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. అవినీతి చేయలేదని చెప్పలేని జగన్.. వార్తలపై అభ్యంతరం ఎలా వ్యక్తంచేస్తారని ప్రశ్నించారు.