సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ, ఈ రోజు వివిధ టీవీ చానల్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన అంతరంగాన్ని పంచుకున్నారు.. రెండు రోజుల క్రితం, జనసేన పార్టీలోకి వెళ్ళటం లేదు అని ప్రకటించిన విషయం తెలిసిందే... వీఆర్ఎస్‌కు ఆయన దరఖాస్తు చేసుకోగా… అది మహారాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర పెండింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే... అయితే ఆయన ఆ పార్టీలో చేరతారు… ఈ పార్టీలో చేరతారనే ప్రచారం ఊపందుకుంది... ఇప్పటికే దీనిపై స్పందించిన లక్ష్మీనారాయణ… ఈరోజు మాట్లాడుతూ… నా సిద్ధాంతాలకు తగిన విధంగా నా భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని ప్రకటించారు...
నా రాజీనామా ఇంకా ఆమోదం పొందలేదు, నేను ఇంకా సెలవులో ఉన్నానన్న సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ… నా రాజీనామా ఆమోదించిన తరువాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్నారు... రాజకీయాల్లోకి వస్తున్నారా అని అడిగితె, నా సిద్ధాంతాలకు తగిన విధంగా నా భవిష్యత్ ఉంటుందన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం నా సేవలు సరిగా గుర్తించలేదనడం సరికాదన్నారు. తాను 20 సంవత్సరాలు మహారాష్ట్ర కేడర్‌లో పనిచేశానని… నాకు మరాఠీ చాలా బాగా వచ్చని… మరాఠీ ప్రజలు కూడా చాలా మంచి వాళ్లన్నారు లక్ష్మీనారాయణ...
రాజీనామా ఆమోదం పొందాక ఎందుకు చేశానన్న విషయం చెబుతానని అన్నారు... అయితే, ఈ సందర్భంలో, ప్రస్తుతం జగన్ కేసులు నడుస్తున్న తీరు గురించి స్పందించమని అడగ్గా, తాను 2013లో సీబీఐ విధుల నుంచి బదిలీ అయిన విషయాన్ని గుర్తుచేశారు. జగన్ పై సీబీఐ కేసుల విషయాన్ని ఇప్పుడున్న సిబిఐ అధికారులని అడిగితే, తెలుస్తుందని చెప్పారు... లక్ష్మీనారాయణ, ఎంతో పర్ఫెక్ట్ గా, జగన్ పై 11 చార్జ్ షీట్లు పెట్టి, 16 నెలలు జైలులో ఉంచిన సంగతి తెలిసిందే... అయితే, ఇప్పుడు జగన్ కేసులలో వేగం తగ్గింది అనే, ఆరోపణలు వస్తున్నాయి... అందుకు తగ్గటే, పరిణామాలు కూడా జరుగుతున్నాయి..