ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సెక్రటేరియట్ లో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఫోటో తీసుకుని వెళ్లి చెత్తలో పడేసారు. మాజీ రాష్ట్రపతికి ఏపి సెక్రటేరియట్ లోనే తీవ్ర అవమానం జరిగింది. ఇదేదో ఏదో చిన్న ఆఫీస్ లోనే, ఎక్కడో ఒక కార్యాలయంలోనే జరిగిన సంఘటన అయితే ఏదో అనుకోవచ్చు. ఇది జరిగింది ఏకంగా ఒక రాష్ట్ర సచివాలయంలో. ఈ ఘటన చూసి, సచివాలయంలో పని చేసే ఉద్యోగులు కూడా అవాక్కయ్యారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉన్న ఫోటో ఫ్రేమ్ నార్త్ బ్లాక్ లో ఉన్న చెత్తలో పడేసారు. ఇది ఎవరు చేసారో తెలియదు కానీ, ఈ ఘటన అందరికీ షాక్ అయ్యేలా చేసింది. ఆయన రాష్ట్రపతిగా ఉండగా, విశాఖ పర్యటన చేసారు. ఆ సమయంలో అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూకి ముఖ్య అతిధిగా ప్రణబ్ ముఖర్జీ వచ్చారు. ఆయన పర్యటన గుర్తుగా, ఈ ఫోటో ఫ్రేమ్ ని రాష్ట్ర సచివాలయంలో పెట్టారు. ఇదే ఫోటోలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు ఆ ఫోటోలో చంద్రబాబు ఉన్నారని, ఆ ఫోటోని పడేసారో లేదో తెలియదు. ఒక వేళ ఆ ఫోటో చూడటం ఇష్టం లేకపోతే, ఎదో ఒక స్టోర్ రూమ్ లో బధ్రపరచాలి కానీ, తీసుకుని వెళ్లి చెత్తలో పడేయటం పై, విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం ఈ ఘటన పై సీరియస్ అయ్యి, బాధ్యుల పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఏపి సెక్రటేరియట్ లో, మాజీ రాష్ట్రపతికి అవమానం...
Advertisements