ఈ రోజు ఉదయం నుంచి, ఆంధ్రప్రదేశ్ పరీక్షలు విషయంలో, నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఉదయం పరీక్షల విషయంలో సుప్రీం కోర్టులో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మొట్టికాయలు పడ్డాయి. సుప్రీం కోర్టు ఏపి ప్రభుత్వం వైఖరి పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో ఏపి ప్రభుత్వంలో ఎట్టకేలకు చలనం వచ్చింది. సుప్రీం కోర్టు ఘాటు వ్యాఖ్యలు నేపధ్యంలో ఉన్నట్టు ఉండి ఒక ఉన్నత స్థాయి భేటీ జరిగింది. ప్రకాశం జిల్లాలో ఉన్న మంత్రి ఆదిమూలపు సురేష్ ని ముఖ్యమంత్రి కార్యాలయం అర్జెంట్ గా రావాల్సిందిగా పిలిపించింది. దీంతో ప్రకాశం జిల్లా నుంచి మంత్రి విజయవాడ వచ్చారు. సుప్రీం కోర్టు వ్యాఖ్యల నేపధ్యంలో అధికారులతో చర్చించారు. ఇక లాభం లేదు అనుకున్నారో, లేదా రేపు శుక్రవారం యధావిధంగా మొట్టికాయలు పడతాయి అనుకున్నారో కానీ, పరీక్షలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇదే విషయం మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి చెప్పారు. అయితే మంత్రి మీడియా సమావేశంలో, పరీక్షలు రద్దు చేయటానికి గల కారణాలు వివారించారు. ఈ రోజు ఉదయం సుప్రీం కోర్టు, జులై 31 నాటికి ఫలితాలు ప్రకటించాలని అన్ని రాష్ట్రాల బోర్డులను ఆదేశిస్తూ తీర్పు ఇచ్చిందని, ఇదే విషయం పై ఈ రోజు చర్చించామని చెప్పారు.

exams 24062021 2

అయితే పరీక్షలు నిర్వహణ, తరువాత మూల్యాంకరణ, ఇతర ప్రక్రియ అంతా పూర్తీ కావాటనికి, తమకు కనీసం 45 రోజులు పడుతుందని అన్నారు. అయితే సుప్రీం కోర్టు ఇచ్చిన గడువు లోపు, మనకు పరీక్షలు నిర్వహించే వీలు లేదని, అంత సమయం తమకు లేదు కాబట్టి, ఇక గత్యంతరం లేని పరిస్థితిలో సుప్రీం కోర్టు ఆదేశాలు ప్రకారం, పరీక్షలు రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే మార్కులు ఎలా ఇవ్వాలి, ఏమిటి అనే దాని పై, హైపవర్ కమిటీ ఏర్పాటు చేస్తామని, హై పవర్ కమిటీ నివేదిక ఆధారంగా మార్కులు ఇవ్వటం జరుగుతుందని అన్నారు. పదో తరగతి, ఇంటర్ పరీక్షలు రెండు రద్దు చేసారు. అయితే ప్రభుత్వం ఇంత మొండిగా వెళ్ళటం, చివరకు సుప్రీం కోర్టు చేతిలో మొట్టికాయలు తిని, చివరకు పరీక్షలు రద్దు చేయటం వెనుక ఉన్న కారణాలు మాత్రం, రాజకీయ కారణాలు గానే తెలుస్తున్నాయి. కేవలం నారా లోకేష్ ఈ విషయంలో మొదటి నుంచి పోరాటం చేస్తున్నారు కాబట్టి, అతని ఎక్కడ క్రెడిట్ వస్తుందో అని ఇక్కడ వరకు తెచ్చుకున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read