రయ్యిరయ్యిమంటూ.. రెక్కలు విప్పుకొంటూ... పడుతూ లేస్తూ.. ఓసారి ఉన్న పళంగా నీటిలోకి ప్రవేశిస్తూ.. మరోసారి హఠాత్తుగా పైకి ఎగురుతూ.. అబ్బో.. ఆశ్చర్యపోయే ఎన్నో రకాల విన్యాసాలకు కృష్ణాతీరం వేదికైంది. స్పీడ్‌ బోట్లలోని పవర్‌ను చూపిస్తూ.. గాలితో పోటీపడుతూ.. మునుపెన్నడూ ప్రత్యక్షంగా తిలకించని జల అద్భుతాలను కళ్ల ముందు ఆవిష్కరించింది. తొమ్మిది దేశాలకు చెందిన రేసర్లు.. 250 కిలోమీటర్ల స్పీడ్‌ బోట్లలో దూసుకెళ్తుంటే.. అలలు అలాఅలా ఎగసిపడగా, కృష్ణాజలమే కాదు.. ఒడ్డున ఉన్న జనం కూడా పులకించిపోయారు. మూడు రోజులపాటు ఫ్‌1హెచ్‌2వో పవర్‌ బోటింగ్‌ రేసుల అమరావతి వాసులని అలరించాయి. మోతెక్కిపోయే మోటార్‌ సౌండ్‌తో.. 250 కిలోమీటర్ల వేగంతో నీళ్లల్లో దూసుకుపోతున్న పవర్‌ బోట్లను చూడటానికి రెండు కళ్లు చాల్లేదు.

manoj 18112018 2

అయితే ఇక్కడ ఆశ్చర్యం ఏంటి అంటే, లక్షల మంది ప్రజలతో పాటు, విపక్ష నాయకులు కూడా ఈ బోటు రేస్ ఎంజాయ్ చేసారు. కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని విమర్శలు చేసిన పలువురు నేతలు కూడా రేసులకు మైమరచిపోయారు. ఘాట్ల వద్ద మెట్లపైనే కూర్చుని రేసర్ల మెరుపు వేగాన్ని ఆస్వాదించారు. సీపీఐ కార్పొరేటర్‌ గాదె ఆదిలక్ష్మి, మంగళగిరిలో నివాసముంటున్న పలువు రు నాన్‌ పొలిటికల్‌ జేఏసీ నేతలు కూడా రేసుల మజాను కాదనలేకపోయారు. తిరిగివెళ్తూ వారివారి ఆనందాన్ని మీడియా ప్రతినిధులతో పంచుకున్నారు. ఇలాంటి కార్యక్రమాలను నగరానికి తీసుకురావడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సఫలీకృతుడయ్యారని, ప్రతిభను ఒప్పుకోవడంలో తప్పులేదని అభినందించారు.

manoj 18112018 3

ఈ రోజు జరిగిన ఫైనల్స్ తరువాత చంద్రబాబు విజేతలకు ఆయన బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయాన మాట్లాడుతూ, జల క్రీడలకు సంబంధించి ప్రకాశం బ్యారేజీ అద్భుతమైన ప్రాంతంగా అభివర్ణించారు. అందుకే ఇక్కడ ప్రతి నెలా ఏదో ఒక కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. విజయవాడ వేదికగా అద్భుతమైన కార్యక్రమం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం నిర్వహించిన రాష్ట్ర పర్యాటక శాఖను అభినందించారు. పోటీల నిర్వహణ ద్వారా అమరావతి సత్తా ఏమిటో ప్రపంచానికి తెలియజెప్పామని సీఎం వ్యాఖ్యానించారు. ఫార్ములా1 పోటీలు ఇక నుంచి ఏటా విజయవాడలో నిర్వహించాలని ఫార్ములా1 హెచ్2వో సంస్థను కోరారు. అద్భుతమైన నదీ తీరం, సుందరమైన ప్రకృతి మన సొంతమని చంద్రబాబు చెప్పారు. కార్యక్రమంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read