ఫేస్‌బుక్ ప్రతినిధులు ఈ రోజు అమరావతిలో, ఐటి శాఖా మంత్రి నారా లోకేష్ ని కలిసారు... లోకేష్ మాట్లాడుతూ, ఫైబర్ గ్రిడ్ ద్వారా 149 రూపాయిలకు ఇంటర్నెట్,వైఫై,టెలివిజన్ అందిస్తున్నాం... ఆంధ్రప్రదేశ్ లో ఫేస్ బుక్ మరింతగా విస్తరించేందుకు ఫైబర్ గ్రిడ్ ఉపయోగపడుతుంది... మీరు నూతన టెక్నాలజీలు అన్ని ఆంధ్రప్రదేశ్ లో పైలెట్ ప్రాజెక్ట్స్ చెయ్యండి, అంటూ ఫేస్‌బుక్ ప్రతినిధులని కోరారు లోకేష్... ఫైబర్ నెట్ ద్వారా గ్రామాల్లోని ఇళ్లల్లో తయారు చేసే ఉత్పత్తులను ప్రపంచ వ్యాప్తంగా తీసుకెళ్లే అవకాశం ఉంది...దీనికి ఫేస్ బుక్ సహకారం అందించండి.... ఫైబర్ గ్రిడ్ వేదికగా వైఫై సేవలు విస్తరించేందుకు సహకరించాలి, అని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఫేస్‌బుక్ ప్రతినిధులను కోరారు..

lokesh 20022018 2

ఫేస్ బుక్ (ఇండియా) హెడ్ ఆఫ్ కనెక్టివిటీ పాలసీ అశ్వినీ రానా, లోకేష్ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించారు... ``ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాం, ప్రతి ఒక్కరికీ ఇంటర్నెట్ సదుపాయం కల్పించే కార్యక్రమానికి మా వంతు సహకారం అందిస్తాం. అధునాతన టెక్నాలజిలతో రూపొందించిన ప్రొడక్ట్స్ ని వినియోగించి ఆంధ్రప్రదేశ్ లో పైలెట్ ప్రాజెక్ట్స్ నిర్వహిస్తాం. గ్రామాల్లో మహిళలు తాము తయారు చేసే ఉత్పత్తులు ఆన్ లైన్లో అమ్ముకునే విధంగా డిజిటల్ ట్రైనింగ్ ఇస్తాం.

lokesh 20022018 3

గ్రామాల్లో మహిళలు చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని వాటి ద్వారా తయారు చేసే ఉత్పత్తులను ఆన్లైన్ లో అమ్ముకునే విధంగా డిజిటల్ మార్కెటింగ్, ఆన్ లైన్ సేఫ్టీ పై ట్రైనింగ్ కల్పిస్తాం, '' అని ఫేస్ బుక్ ప్రతినిధులు పేర్కొన్నారు...అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు ఇంటర్నెట్‌ ప్రాథమిక హక్కుగా మారబోతుందన్నారు. ప్రతి ఇంటికి ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తామన్నారు. ఏపీలో ఫేస్‌బుక్ విస్తరణకు ఫైబర్ గ్రిడ్ ఉపయోగపడుతుందని చెప్పారు. గ్రామాల్లో తయారు చేసే ఉత్పత్తుల ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌కు ఫేస్‌బుక్‌ సహకారం అవసరమని మంత్రి లోకేష్‌ అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read