రెండు రోజుల క్రితం వరకు కర్ణాటకలో, బీజేపీ ఓడిపోతుంది అని, కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుంది అని, మోడీ చేసిన అన్యాయం పై తెలుగు వారి రగిలి పోతున్నారని, కర్ణాటకలో ఉన్న తెలుగు వారు అందరూ, బీజేపీ ని ఓడించి, మోడీకి బుద్ధి చెప్తారని, హైదరాబాద్ మీడియా ఊదరగొట్టింది... నిజానికి, గ్రౌండ్ రియాలిటీ కూడా అదే... అయితే, గత రెండు రోజుల నుంచి, నెమ్మదిగా ట్యూన్ మారుస్తూ వచ్చారు... ఈ రోజు, ఏకంగా లగడపాటి సర్వే అనే అర్ధం వచ్చేలా, బీజేపీ గెలిసిపోతుంది అని వార్తలు రాసారు... మోడీ వచ్చిన తరువాత సీన్ మారిపోయింది అంటూ, తెలుగు వారిని ప్రభావితం చేసేలా వార్తలు వేసారు... మరీ ముఖ్యంగా, తెలుగుదేశం సానుభూతిపరులు నమ్మే పేపర్ ఒకటి, అలాగే మరో తెలుగు న్యూస్ ఛానల్, ఇలా రాయటంతో, దీని వెనుక ఎదో మతలబు ఉంది అంటూ, విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు...
నిజానికి గ్రౌండ్ లెవెల్ లో, కర్ణాటకలో బీజేపీ గెలిచే అవకాశమే లేదని, ఇప్పటికీ నోట్ల రద్దు వల్ల కలిగిన కస్టాలు, GST, ATM లలో డబ్బులు లేకపోవటం, ఇవన్నీ సామాన్య ప్రజలను ఇబ్బంది పెడుతూనే ఉన్నాయని, పైగా మోడీ చెప్పే అబద్ధాలు నమ్మే పరిస్థితిలో కర్ణాటక ప్రజలు లేరని అభిప్రాయ పడుతున్నారు... తెలుగు మీడియాలో వచ్చిన వార్తలు, కేవలం చివరి నిమిషంలో చేసే పోల్ మ్యానేజిమెంట్ లో భాగంగానే జరుగుతున్నవి అని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు... అందుకే, తెలుగు దేశం సానుభూతి పరులు, ఎక్కువగా చూసే పేపర్ లో, బీజేపీ గెలుస్తుంది అని వార్తా రాసి, కొంత వరకు, కర్ణాటకలోని తెలుగు ప్రజల్లో అలజడి రేపే ప్రయత్నం చేసినట్టు విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు...
బీజేపీ, కేసీఆర్, మీడియాను ప్రభావితం చేసి ,విడుదల చేసే రాతల వలన కర్నాటకలో తెలుగు వారు, ఎలాగూ బీజేపీ గెలుస్తుందని, రిస్క్ తీసుకోవటం ఎందుకని వారికే ఓటేస్తారనేది వారి వ్యూహం... అయినా లగడపాటి సర్వే పేరిట, ఆ పేపర్ ఇలా రాయటం చూస్తుంటే, అక్కడ కాంగ్రెస్ గెలిస్తే, ఇక్కడ తెలంగాణాలో కాంగ్రెస్ బలపడుద్ది అని, అందుకే ఆ పేపర్ ద్వారా, కెసిఆర్ ఆడిస్తున్న డ్రామాగా విశ్లేషకులు భావిస్తున్నారు.. బీజేపీ వెనుకాల ఎలాగూ ఉండనే ఉంది.... మొత్తంగా లగడపాటి పెరు చెప్పి, కర్ణాటక తెలుగు ప్రజల్లో ఒక విధమైన కన్ఫ్యూషన్ క్రియేట్ చెయ్యటంలో, కెసిఆర్, బీజేపీ, హైదరాబాద్ మీడియా సక్సెస్ అయ్యారు... అయినా, కొన్ని నెలల క్రితం ఇలాగే వైసిపీ, లగడపాటి పేరు మీద కొన్ని పిచ్చి సర్వేలు ప్రచారం చేస్తుంటే, అప్పుడు లగడపాటి చెప్పిన మాట "నేను ఏ సర్వే చేసినా, మీడియా ముందుకు వచ్చి చెప్తాను... నా సర్వే అని ఎవరన్నా రాస్తే నమ్మకండి...." అని చెప్పారు... ఈ హైదరాబాద్ మీడియాకు, చంద్రబాబు ఎక్కువ లాభమా, కెసిఆర్ ఎక్కువ లభమా అని బేరీజు వేసుకుంటే, వీరు ఎప్పటికైనా కెసిఆర్ వైపే వెళ్తారు... మనం, ఇలాంటి వారితో ఎప్పటికైనా జాగ్రత్తగా ఉండాలి.. అందుకే, మన మీడియా మనకు ఉండాలి అనేది...