చంద్రబాబు పై ఎప్పుడూ విష ప్రచారమే. ఆయన అధికారంలో ఉన్నా, ఆయన అధికారంలో లేకున్నా విష ప్రచారమే. తమ వాదన కరెక్ట్ అని చెప్పుకోవటానికి, వైసిపీ చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. తమ అనుకూల మీడియాలో, అలాగే పైడ్ సోషల్ మీడియా క్యాంపైన్ ద్వారా, ఎదో జరిగిపోతుంది అంటూ, విషం చిమ్ముతూనే ఉంటారు. ఒక విధంగా చెప్పాలి అంటే, ఇది చంద్రబాబు, తెలుగుదేశం వైఫల్యం. తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోవటానికి, ఈ విష ప్రచారం కూడా ఒక కారణం. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా, అదే విష ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే అమరావతి అంటే, వైసిపీకి ఎంత మంటో అందరికీ తెలిసిందే. మొన్నటి దాక అమరావతి మునిగిపోతుంది అని ప్రచారం చేసే వారు గుర్తుందా ? అయితే ఇప్పుడు వరదలు వస్తున్న సంగతి తెలిసిందే.

house 14082019 2

కృష్ణా కరకట్ట పై ఉన్న చంద్రబాబు నివాసం పై , ఇప్పుడు విష ప్రచారం మొదలు పెట్టారు. చంద్రబాబు నివాసంలోకి నీళ్ళు వచ్చేసాయని, సిమెంట్ బస్తాలు వేసి, వరదను ఆపుతున్నారని, చంద్రబాబుని సురక్షిత ప్రాంతానికి తరలించారు అంటూ, విష ప్రచారం చేస్తున్నారు. నిజానికి చంద్రబాబు నిన్న హైదరాబాద్ వెళ్లారు. ఆయన చెయ్య నొప్పి కారణంగా, చికిత్స చేయించుకుంటానికి హైదరాబాద్ వెళ్లారు. అయితే, వీళ్ళు మాత్రం, చంద్రబాబుని భద్రతా బలగాలు సురక్షిత ప్రాంతానికి తరలించాయి అంటూ విష ప్రచారం చేస్తున్నారు. అయితే ఇప్పుడు తాజగా చంద్రబాబు ఉంటున్న నివాసం దగ్గర పరిస్థితి పై ఫోటోలు విడుదల అయ్యాయి, ఆ ఫోటోల్లో ఎక్కడా, చంద్రబాబు నివాసం దగ్గరకు నీళ్ళు రాలేదు.

house 14082019 3

ఎప్పుడూ ఎలా ఉంటుందో, నీళ్ళు అలాగే ఉన్నాయి. ఎప్పటి లాగే చంద్రబాబు నివాసంతో పాటు, మిగతా కరకట్ట భవనాలు ఉన్నాయని, ఫోటోలు చూస్తే తెలుస్తుంది. మరి, ఈ విష ప్రచారం ఎందుకు ? తమ వాదన కరెక్ట్ అని చెప్పుకునే ప్రయత్నమా ? వరద ఇలాగే వచ్చినా ఇబ్బంది ఉండదు, ఎందు కంటే, గేటులు అన్నీ ఎత్తేసి, నీళ్ళు కిందకు వదులుతున్నారు. వీళ్ళు ఏదైనా కుట్ర పన్ని, గేటులు మూసేసి, కావలని చేస్తే తప్ప, ఇప్పుడు వస్తున్న వరదకు, చంద్రబాబు ఇంటికి వచ్చిన ఇబ్బంది ఏమి లేదు. ఒక వేళ వచ్చినియ్యే అనుకుందాం, ఏమి అవుతుంది ? రెండు రోజులు బయట ఉంటారు. కొన్ని వేల కుటుంబాలు, కరకట్ట పై ఉంటాయి, వారు చేసేది అదేగా ? ఈ మాత్రం దానికి ఈ పైశాచిక ఆనందం దేనికి ? వరదలు వచ్చి ప్రజలు ఇబ్బంది పడుతుంటే, వారి సంగతి చూడాలి కాని, ఎంత సేపు రాజకీయమేనా ? అందుకే చంద్రబాబు వీళ్ళను సైకోలు అనేది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read