మాట్లాడితే మాది రైతు ప్రభుత్వం అంటారు. మా నాన్న రైతు పక్షపాతి అని, ఆయన పుట్టిన రోజుని ఏకంగా ఈ రాష్ట్ర రైతు దినోత్సవం చేసేసారు. పేపర్లలో పెద్ద పెద్ద యాడ్ లు ఇచ్చి మరీ, రైతులకు అది చేసాం, ఇది చేసాం అని డబ్బా కొడుతున్నారు. అసలు రైతులు ఇప్పుడే పండిస్తున్నారని, సంతోషంగా ఉన్నారని డబ్బా కొడుతున్నారు. కౌలు రైతులను కూడా ఆదుకున్నాం అన్నారు. కట్ చేస్తే సమయానికి విత్తనాలు, ఎరువులు ఇవ్వరు. ప్రకృతి విపత్తులు వస్తే ఆదుకోరు. మద్దతు ధర ఇవ్వరు. ధాన్యం కొని, డబ్బులు ఇవ్వరు. ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు. ఇలా ఒకటి కాదు రెండు కాదు, వ్యవసాయం మొత్తం సంక్షోభంలో పడింది. ఇదే ఇప్పుడు ప్రభుత్వ గణాంకాల రూపంలో కూడా బయట పడింది. ప్రభుత్వ లెక్కలే ఇలా ఉన్నాయి అంటే, ఇక అసలు లెక్కలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. దేశంలో వివిధ కారణాల వల్ల ఆ-త్మ-హ-త్య-లు చేసుకున్న వారి గణాంకాలను నేషనల్ క్రైమ్స్ రికార్డు బ్యూరో విడుదల చేసింది. ఇందులో రైతుల ఆ-త్మ-హ-త్య-ల వివరాలు ఉన్నాయి. ఈ లెక్కలు చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తున్న మాటలకు, వేస్తున్న ప్రకటనలకు, చేస్తున్న హడావాడికి, నిజంగా వాస్తవంగా ఏపిలో రైతుల పరిస్థితి ఎలా ఉంది అనే విషయం అర్ధం అవుతుంది.
నేషనల్ క్రైమ్స్ రికార్డు బ్యూరో లెక్కలు ప్రకారం, రైతన్నల ఆ-త్మ-హ-త్య-ల్లో, ఏపి దేశంలోనే మూడో స్థానంలో ఉంది. గత ఏడాది కాలంలో 889 మంది రైతులు మన రాష్ట్రంలో ఆ-త్మ-హ-త్య-లు చేసుకున్నారు. ఇందులో రైతులు, కౌలు రైతులు, రైతు కూలీలు కూడా ఉన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక తరువాత, ఆ స్థానం ఏపి ఆక్రమించింది. అంటే రోజుకు సగటున, ఇద్దరు నుంచి, ముగ్గురు రైతులు మన రాష్ట్రంలో ఆ-త్మ-హ-త్య-లు చేసుకుంటున్నారు. ఈ గణాంకాలు చూస్తే, రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక కౌలు రైతుల ఆ-త్మ-హ-త్య-ల విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండో స్థానంలో ఉంది. దేశంలో కౌలు రైతులు ఆ-త్మ-హ-త్య-ల విషయం చూస్తే, ఏపి నుంచే 22 శాతం మంది ఉన్నారు. 2018తో పోల్చితే, అంటే చంద్రబాబు హయాంతో పోల్చితే, 2020లో జగన్ హాయాంలో రైతు ఆ-త్మ-హ-త్య-లు 33 శాతం పెరిగాయి. రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఇంత దయనీయంగా ఉంటే, మాది రైతు ప్రభుత్వం అని ప్రభుత్వం ఎలా డబ్బా కొడుతుందో అర్ధం కావటం లేదని టిడిపి విమర్శలు చేస్తుంది.