రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో ఎప్పుడూ వినపడని మాట, విత్తన కష్టాలు.. 2014కి ముందు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సమయంలో, ప్రతి ఏడాది విత్తనాల కోసం రైతులు పోరాటం చెయ్యాల్సి వచ్చేది. లాఠీ దెబ్బలు తినేవారు. చివరకు పోలీస్ స్టేషన్ లో విత్తనాలు ఇచ్చిన పరిస్థితి కూడా ఉండేది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత, అసలు అలాంటి కష్టమే లేదు. రైతులకు టైంకి విత్తనాలు అందేవి. తొలకరికి రెడీ అయ్యి, చక్కగా పొలం పనులు చేసుకునే వారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం మారటంతో, రైతులకు మళ్ళీ విత్తన కష్టాలు మొదలయ్యాయి. ఒక పక్క వర్షాలు లేక ఇబ్బంది పడుతుంటే, మరో పక్క విత్తనాలు లేక అల్లాడుతున్నారు. రైతులు ఆందోళనలు చేస్తున్నా, ఎవరికీ పట్టటం లేదు. తాజాగా జరిగిన ఘటన అందరినీ కలిచి వేసింది. అనంతపురం జిల్లా, రాయదుర్గం మండలం వేపరాళ్ల గ్రామానికి చెందిన రైతు ఈశ్వరప్ప, విత్తనాల కోసం, తిరిగి తిరిగీ, చివరకు అదే విత్తనాల కోసం లైన్ లో నుంచుని, నుంచుని, గుండె పోటు వచ్చి చనిపోయారు.

ఈశ్వరప్ప ఉదయాన్నే విత్తన కేంద్రానికి వచ్చి లైన్ లో నిలబడ్డారు. అయితే ఎంత సేపటికీ విత్తనాలు ఇవ్వకపోవటం, చాలా ఆలస్యం కావటంతో, ఎక్కువ సేపు లైన్ లో నుంచున్నారు. మధ్యాహ్న సమయంలో గొండెల్లో నొప్పి వచ్చి, ఉన్నఫలంగా క్యూలో కుప్పకూలిపోయాడు. వెంటనే అక్కడ ఉన్న తోటి రైతులు చికిత్స నిమిత్తం ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఈశ్వరరావు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో వేపరాళ్లలో విషాదం చోటుచేసుకుంది. మరో పక్క, ఇతర ఘటనల్లో కూడా, రైతులు స్పృహ తప్పి పడిపోయారు. శెట్టూరు మండల కేంద్రంలోని విత్తనాల పంపిణీ కేంద్రం వద్ద, మహిళా రైతు రత్నమ్మ స్పృహ తప్పి పడిపోయింది. వజ్రకరూరులోని విత్తన పంపిణీ కేంద్రం లైన్ లో ఉన్న మహిళా రైతు కళ్లు తిరిగి కింద పడిపోయింది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి విత్తనాల కొరత నివారించాలని రైతులు కోరుతున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read