పట్టిసీమ ఎత్తిపోతల పోయిన ఏడాది ఐదు నెలలు నిరాఘాటంగా గోదావరి జలాలు ఇచ్చి కృష్ణా డెల్టా రైతులకు సాగునీటి కొరత తీరింది. పట్టిసీమ ద్వారా గోదావరి నీరు కృష్ణా డెల్టాకు చేరడంతో నాలుగు జిల్లాల్లో ఖరీఫ్ సీజను గట్టెకింది... రైతుల ఇళ్లల్లో ఆనందం వెల్లివిరిసింది... పొలాల్లో నిండుగా పెరిగిన వరి పంట మూలంగా అధిక దిగుబడులు వచ్చి రైతులు మురిసిపోయారు... గతం కంటే వరి దిగుబడులు అధికంగా ఉండటంతో ఉబ్బితబ్బవుతున్నారు... ఎత్తిపోతల పధకంలోని 24 మోటార్లను జూన్ 18న ఆన్ చేసి రోజుకు 8500 క్యూసెక్కుల గోదావరి నీటిని పోలవరం ప్రాజెక్ట్ కుడి కాలువ ద్వారా కృష్ణా జిల్లాకు తరలించారు. 2017లో 105.8 టిఎంసీల నీటిని తరలించారు.
అలాగే దివి సీమ రైతుల సంతోషానికి అవధులు లేవు... క్రింద వీడియోలో చూడండి వారి ఆనందం... కృష్ణా డెల్టాలోనే చిట్టచివారి ఆయకట్టు ప్రాంతం అయినా, ఈ పేరు వినగానే ఎవరికైనా ముందుగా గుర్తుకొచ్చేది ఈ ప్రాంతంలో రైతులు ఎదుర్కొనే సాగునీటి కష్టాలే... దాదాపు రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ పరిస్థితి కారణంగా రైతులు ఏటా నష్టాలను చవిచూస్తున్నారు. పంట కాల్వల పైనే ఆధారపడి వ్యవసాయం చేసే ఈ ప్రాంతంలోని అన్నదాతలకు గత సంవత్సరం నుంచి ప్రభుత్వం పట్టిసీమ ద్వారా అందిస్తున్న సాగునీరు వారి పాలిట వరంగా మారింది. దాదాపు లక్ష ఎకరాల ఆయకట్టు కలిగిన దివి ప్రాంతంలో రెండేళ్లుగా ఏర్పడిన తీవ్ర వర్షా భావ పరిస్థితుల్లోనూ రైతులు సిరులు పండించారంటే అందుకు ప్రధాన కారణం పట్టిసీమే..
దివిసీమ అంతా మొత్తం వరి పచ్చగా దర్శనమిస్తూ రైతుకు కనువిందు చేస్తోంది. పట్టిసీమ ద్వారా సకాలంలో నీరు అందడంతో పాటు కొండకోనల నుంచి పోషకాలతో కూడిన ఒండ్రును మోసుకురావటంతో పంట పొలాల్లో వరి పైరు బంగారు వర్ణంతో కనుల పండుగ చేసింది. ఎకరాకు 35 నుంచి 45 బస్తాల మేర దిగుబడి వచ్చి రైతులు సంతోషంగా ఉన్నారు... మరి ఇప్పటికీ పట్టిసీమ దండగ అని హేళన చేస్తున్న ప్రతిపక్ష నాయకుడు జగన్ మోహన్ రెడ్డి, ఏ మొహం పెట్టుకుని కృష్ణా జిల్లాలో పాదయత్ర చేస్తాడు ? ఏ మొహం పెట్టుకుని రైతులు దగ్గరకు వచ్చి పట్టిసీమ దండగ అని చెప్తాడు ? పట్టిసీమని ప్రాణంగా భావిస్తున్న రైతులు, దాన్ని దండగ అంటే ఊరుకుంటారా ? అసలు జగన్ కు కృష్ణా జిల్లాలో పాదయత్ర చెయ్యటానికి మొఖం చెల్లుతుందా ?