చంద్రబాబు సియం అయిన వెంటనే ప్రారంభించిన ప్రతిష్టాత్మిక ప్రాజెక్ట్ ఫైబర్ నెట్. కేవలం 150 రూపాయలకే, ఫోన్, ఇంటర్నెట్, కేబుల్ అందించే ప్రాజెక్ట్ ఇది. రాష్ట్రంలో పేదలకు కూడా ఈ సేవలు అందిస్తే, పరిపాలన సేవలతో పాటు, విజ్ఞానం, వినోదం మరింత దగ్గర అవుతుందని చంద్రబాబు ఇది మొదలు పెట్టారు. ఇప్పటికే చాలా చోట్ల కనెక్షన్ లు ఇస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి ఈ ప్రాజెక్ట్ ఆపటానికి చెయ్యని ప్రయత్నం లేదు. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఆపేసే ప్రయత్నం జరుగుతుంది. ‘బ్యాంకుల నుంచి మూలధనం కింద రుణాలు తీసుకురావడం.. సిబ్బంది జీత భత్యాల కోసం ప్రభుత్వ నిధులపై ఆధారపడడం ఎల్లవేళలా కుదరదు. ఇదే విధంగా మున్ముందు మనుగడ సాగిద్దామంటే కుదరదు. ఇదే వైఖరిని కొనసాగిస్తే ఫైబర్‌నెట్‌ మూసివేత ఖాయం’ అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం హెచ్చరించారు.

lv 29042019

ఈ హెచ్చరికలతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఫైబర్‌నెట్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్ఎఫ్‌ఎల్‌‌) సిబ్బందిలో ఆందోళన మొదలైంది. తమ సంస్థ మనుగడ ఎలా ఉంటుందోనన్న భయం ప్రారంభమైంది. అర్ధాంతరంగా సంస్థను మూసేస్తే తమ బతుకుక్ష రోడ్డున పడతాయన్న అలజడి రేగుతోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. ఈ నెల 25వ తేదీ (గురువారం)నాడు ఆర్థిక శాఖ పద్దులపై సీఎస్‌ ఎల్వీ టెలికాన్ఫరెన్సు నిర్వహించారు. ఫైబర్‌నెట్‌ సంస్థ అధికారులనూ ఇందులో చేర్చారు. రాష్ట్రంలో సమాచార, సాంకేతిక విప్లవాన్ని తీసుకువచ్చే డిజిటల్‌ ఆంధ్ర ప్రదేశ్‌ను విస్తరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పించారు. ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్న పరిస్థితి. వాణిజ్య విధానంలో మెరుగైన ఫలితాలు సాధించేలా కార్యాచరణనూ సిద్ధం చేసుకుంది.

lv 29042019

ఇలాంటి సమయంలో సీఎస్‌ చేసిన వ్యాఖ్యలు భయాందోళనలు రేకెత్తిస్తున్నాయని సిబ్బంది చెబుతున్నారు. ‘ఇకపై ఫైబర్‌నెట్‌ స్వీయ లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి నెలా రూ.60 కోట్ల మేర ఆదాయాన్ని సాధించాలి. ఎంత లేదన్నా ఏటా రూ.660 కోట్ల ఆదాయం రావాలి. చేసిన అప్పులకు వడ్డీలు, సిబ్బంది జీతభత్యాల చెల్లింపు ప్రభుత్వ నిధులతోనే చేస్తామంటే ఫైబర్‌నెట్‌ను వైండప్‌ చేసేయాల్సిందే’ అని టెలికాన్ఫరెన్స్‌లో సీఎస్‌ హెచ్చరించడంపై వాపోతున్నారు. ఏ సంస్థయినా నిలదొక్కుకోవాలంటే కొంత సమయం పడుతుందని.. ఇప్పుడిప్పుడే సంస్థ ఆర్థికంగా పట్టు సాధిస్తున్న సమయంలో సీఎస్‌ తీరు వారిని ఆందోళనకు గురిచేస్తోంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read