విభజన అనంతరం రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చి ఆర్థిక పరంగానూ, ఉపాధి పరంగానూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం పడిన కష్టానికి ప్రతిఫలం దక్కబోతోంది. కేవలం ఆరునెలల వ్యవధిలో దాదాపు 15 కంపెనీలు ఏర్పాటు కానున్నాయి. ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్స్ రంగానికి చెందినవి కావడం విశేషం. పెట్టుబడిదారులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలను సడలించడం, సింగిల్ విండో ద్వారా అనుమతులు ఇవ్వడం, కేవలం నెల రోజుల వ్యవధిలో అనుమతులిచ్చే విధంగా కార్యాచరణ రూపొందించడం వంటి కార్యక్రమాలతో ఇవన్నీ సాధ్యపడ్డాయనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే, అనుమతులు ఇవ్వడం ఒకెత్తయితే, ఈ కంపెనీల ఏర్పాటుకు భూ కేటాయింపులు మరో ఎత్తు. ప్రస్తుత పరిస్థితుల్లో భూముల రేట్లు విపరీతంగా పెరిగిన నేపద్యంలో ఈ కంపెనీలు కోరిన విధంగా భూములు కేటాయించడం రాష్ట్ర ప్రభుత్వానికి ఒకరకంగా తలకుమించిన భారమే.

electronics 03072018 2

అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి కష్టాలను వెరవక భూ కేటాయింపులకు ప్రత్యేక డ్రైవ్ పెట్టి మరీ పెట్టుబడిదారులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చూస్తూ రాష్ట్రానికి ఆహ్వానిస్తోంది. గత నాలుగేళ్లుగా అనేక దఫాలుగా చర్చలు జరిపిన నేపథ్యంలో ఇప్పటికీ అవన్నీ కార్యరూపం దాల్చేందుకు అవకాశం ఏర్పడింది. ఎలక్ట్రానిక్స్ రంగానికి సంబంధించి రాష్ట్రంలో అనేక కొత్త సంస్థలు ఏర్పాటు కానున్నాయి. ఇప్పటికే ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందాలు చేసుకున్న ఆయా కంపెనీలు రెండు నుండి ఆరు నెలల వ్యవధిలో తమ సంస్థల కార్యకలాపాలను ప్రారంభించేందుకు సమాయత్తం అవుతున్నాయి. ఎలక్ట్రానిక్స్ రంగంలో రాష్ట్రానికి రూ.24,802 కోట్ల పెట్టుబడులతో వచ్చే సంస్థల్లో 82, 750 మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఈ రంగంలో ఇప్పటికే 13,900 మందికి ఉపాధి కల్పించినట్లు ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ రూపొందించిన నివేదికలో పేర్కొన్నారు. ఇటీవల నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ఈ నివేదికను రూపొందించారు.

electronics 03072018 3

వచ్చే ఆరు నెలల్లో, కొత్తగా ఏర్పాటు కాబోయే సంస్థల్లివే...స్పెక్షం ఇల్యూమినస్ అనే ఎల్ఈడీ బల్బులు తయారుచేసే సంస్థ రెండు నెలల్లో తమ కార్యకలాపాలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందిస్తుంది. అదేవిధంగా ఆర్క్ సిస్టమ్స్ అనే ఎనర్జీ మీటర్ల తయారీ సంస్థ రెండు నెలల్లోనూ, సంజ్యాన్ జియాన్ ఎలక్ట్రానిక్స్ అనే ఛార్జర్ల కంపెనీ మూడు నెలల్లోనూ, పారామౌంట్ అనే మెకానిక్ సంస్థ 3నెలల్లోనూ, పీజీ ప్లాస్ట్ అనే కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ సంస్థ 5 నెలల్లోనూ, ఐజేఏ ఎలక్ట్రానిక్స్ అనే పీసీబీలను తయారుచేసే సంస్థ 5 నెలల్లోనూ, జియామన్ ప్రెసిసన్ అనే కొలతల పరికరాల తయారీ సంస్థ 6 నెలల్లోనూ, సిగ్టఫుల్ అనే మెడికల్ ఎలక్ట్రానిక్స్ వస్తువుల తయారీ సంస్థ 6 నెలల్లోనూ, విస్టియన్ అనే ఆటో ఎలక్ట్రానిక్స్ గూడ్స్ తయారీ సంస్థ 6 నేలల్లోనూ, డబ్ల్యూయూఎస్ ప్రింటెడ్ సర్క్యూట్స్ అనే పీసీబీ తయారీ సంస్థ 6 నెలల్లోనూ, నోబుల్ మౌల్డ్ అనే ఫ్రిజ్, ఏసీ, వాషింగ్ మెషీన్ల తయారీ సంస్థ 6 నెలల్లోనూ, అప్లైడ్ మెటీరియల్స్ అనే నానోటెక్ తయారీ సంస్థ 6 నెలల్లోనూ, వర్త్ ఎలక్ట్రానిక్స్ అనే పీసీబీ తయారీ సంస్థ 6 నెలల్లోనూ తమతమ కంపెనీల ఉత్పత్తులను ప్రారంభించాలని యోచిస్తున్నాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read