‘‘ఆంధ్రప్రదేశ్‌లో మాకు అంత బలం లేదన్నది నిజం. కానీ... టీడీపీ ఓటమికి గట్టిగా కృషి చేస్తున్నాం. ప్రధాని మోదీపై చంద్రబాబు దాడి మొదలుపెట్టారు. ఇదొక తప్పిదమైతే... మా బద్ధ శత్రువైన కాంగ్రె్‌సతో చేతులు కలపడం అంతకంటే ఘోర తప్పిదం. అలాంటప్పుడు ఆయనను దెబ్బతీయకుండా ఎలా వదిలేస్తాం! ఇందుకు తగిన ప్రణాళికలు ఎప్పుడో సిద్ధమయ్యాయి! సీమాంధ్రలో తెలుగుదేశం ఫినిష్‌ అయితే... రెండో పార్టీగా మేమే బలం పుంజుకుంటాం!’’ .... బీజేపీ సీనియర్‌ నేత ఒకరు చెప్పిన మాట ఇది! విషయం సుస్పష్టం! నవ్యాంధ్రకు చట్టబద్ధంగా ఇవ్వాల్సినవి ఇచ్చినా, ఇవ్వకపోయినా... నోర్మూసుకోవాలి! నిలదీయవద్దు, ప్రశ్నించవద్దు! ఇక... మోదీపై పోరు మొదలుపెడితే... ‘ఫినిష్‌’ చేస్తాం! సీమాంధ్రకు ఢిల్లీ బీజేపీ పెద్దలు పంపిస్తున్న హెచ్చరికలివి! విభజన హామీలతోపాటు ప్రత్యేక హోదాపై కేంద్రంతో పోరుకు దిగిన చంద్రబాబు... ఈ విషయంలో చాలా దూరం వెళ్లారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడంతోపాటు... బీజేపీకి వ్యతిరేకంగా జాతీయస్థాయిలో పార్టీలను ఒక్కటి చేశారు. ఇది.. కమలం పెద్దలకు కంటగింపుగా మారింది! ‘ఏదిఏమైనా సరే, ఏపీలో టీడీపీ రావొద్దు’ అని బీజేపీ నిశ్చయించుకుంది. త్రిముఖ వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఇవి ఢిల్లీ, హైదరాబాద్‌ కేంద్రంగా అమలవుతున్నాయి. బీజేపీ, వైసీపీ, టీఆర్‌ఎస్‌ సమన్వయంతో వ్యవహరిస్తూ.. తమ ఉమ్మడి శత్రువైన చంద్రబాబుపైకి అనేక అస్త్రాలు గురిపెట్టినట్లు తెలుస్తోంది.

టీడీపీని దెబ్బ తీసేందుకు రచించిన వ్యూహాల్లో ఒకటి.. ‘ఆర్థిక దిగ్బంధం’! టీడీపీకి మొదటి నుంచీ ఆర్థిక సహకారం అందిస్తున్న సుమారు 20మంది పారిశ్రామిక వేత్తలపై ఢిల్లీ స్థాయిలో గురిపెట్టారు. ఐటీ, ఈడీతో సహా వివిధ సంస్థలను వారిపైకి ప్రయోగిస్తున్నారు. తాఖీదుల మీద తాఖీదులు పంపడం, సోదాలకు దిగడం ద్వారా వారిపై ఒత్తిడి పెంచుతున్నారు. రాయలసీమకు చెందిన ఒక అధికారి ద్వారా ‘నోటీసుల’ పర్వం నడిపిస్తున్నారు. ‘ఏదో ఒక నెపంతో నోటీసులు పంపండి’ అంటూ పైస్థాయి నుంచి ఆదేశాలు వస్తున్నట్లు ఐటీ అధికారులు చెబుతున్నారు. అలాగే.. టీడీపీకి నిధుల సరఫరా అడ్డుకోవడంతోపాటు, వైసీపీకి మాత్రమే ఆర్థికంగా సహకరించేలా చూడటం కూడా ఈ వ్యూహంలో భాగమే. ఇది ప్రధానంగా హైదరాబాద్‌ కేంద్రంగా నడుస్తోం ది. తెలంగాణతో ఆర్థిక ప్రయోజనాలు ముడిపడిన సీమాంధ్ర పారిశ్రామిక వేత్తలను పిలిపించి మరీ హెచ్చరిస్తున్నట్లు సమాచారం. ‘మీరు టీడీపీకి మద్దతు ఇస్తే.. ఇక్కడ వ్యాపారాలు చేసుకోలేరు. మద్దతైనా, విరాళాలైనా వైసీపీకే ఇవ్వాలి’ అని సూటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ‘అవసరమైతే శ్రీకాకుళానికి వెళ్లిపోయి వ్యాపారం చేసుకుంటా. మీ బెదిరింపులకు మాత్రం లొంగ ను. మీ ఇష్టమొచ్చినట్లు చేసుకోండి’ అని ఒక వ్యాపారి తేల్చిచెప్పినట్లు తెలిసింది.

త్రిముఖ వ్యూహంలో మరొకటి టీడీపీ అభ్యర్థులను ఎగరేసుకుపోవడం. ఇక్కడ కూడా పారిశ్రామికవేత్తలైన నాయకులపైనే గురి. ‘మీరు టీడీపీ తరఫున పోటీ చేయవద్దు. వైసీపీలో చేరిపోండి’ అని ఆదేశించి, టికెట్‌ కూడా ఖరారు చేయిస్తున్నారు. కాదూ కూడదంటే.. ‘మీ వ్యాపారాలు క్లోజ్‌’ అని హెచ్చరికలు పంపిస్తున్నారు. టీడీపీ ప్రజాప్రతినిధిగా ఉన్న ఒక ప్రముఖ వ్యాపారి.. ఆఖరి నిమిషంలో వైసీపీలో చేరిపోయారు. అక్కడ ఆయనకు ఎంపీ టికెట్‌ ఖరారైంది. ఆయనపై తెలంగాణతోపాటు.. తమిళనాడు ద్వారా కూడా ఒత్తిడి చేయించినట్లు సమాచారం. ఇక.. వ్యాపారం దాదాపు దివాలా తీసి కష్టాల్లో ఉన్న మరో పారిశ్రామికవేత్తకూ ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. ‘బ్యాంకులు ఆర్థికంగా ఆదుకోవాలంటే వైసీపీ తరఫున పోటీ చేయండి’ అని చెప్పడంతో... ఆయన సైకిల్‌ దిగి, ఫ్యాను కింద కూర్చున్నారు. టీడీపీని ఒకవైపు ఆర్థికంగా, రాజకీయంగా దెబ్బతీస్తూనే... మరోవైపు నుంచి వైసీపీ సలహాదారు ప్రశాంత్‌ కిశోర్‌ ద్వారా మైండ్‌గేమ్‌కు తెరలేపడం మరో వ్యూహం! ‘అనుకూలమైన’ సర్వేలు చేయించడం, ఆ సమాచారాన్ని లీక్‌ చేయడం ఇందులో కీలకం! అలాగే... ‘ఫలానా నేత పార్టీ మారుతున్నారు’ అంటూ తప్పుడు వార్తలు సృష్టి తీసుకొస్తారు. జగన్‌ మీడియాతోపాటు సోషల్‌ మీడియా ద్వారా ఆ వార్తలను విస్తృతంగా ప్రచారంలోకి తీసుకొస్తారు. ఉదాహరణకు... ఇటీవల ఒక టీడీపీ నాయకుడు విజయవాడలో లోకేశ్‌తో ఉండగానే ఆయన లోట్‌సపాండ్‌లో జగన్‌ను కలవనున్నట్లు ప్రచారం చేశారు. ఇలాంటివన్నీ మైండ్‌గేమ్‌లో భాగమే. నిజానికి... ఈ వ్యూహాన్ని కర్ణాటక ఎన్నికల్లోనూ బీజేపీ అమలు చేసింది. చంద్రబాబు విషయంలో మరింత బలంగా అమలు చేస్తోంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read