ఉద్యోగాలు చేసుకునే వారు ఫస్ట్ తారీఖు కోసం ఎదురు చూస్తూ ఉంటారు.. పిల్లలు సెలవులు కోసం ఎదురు చూస్తూ ఉంటారు... అలాగే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మంగళవారం కోసం ఎదురు చూస్తుంది. ఏమిటీ మంగళవారం సెంటిమెంట్ అనుకుంటున్నారా ? సెంటిమెంట్ లేదు ఆయింటుమెంటు లేదు. మంగళవారం నాడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో, అన్ని రాష్ట్రాలు అప్పులు తీసుకునే వీలు ఉంటుంది. సహజంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అప్పు అంటే పండుగే కదా. ఎలాగూ ఆదాయం లేదు. పెరుగుతుందనే ఆశ లేదు. ఎలాగైనా నెల గడవాలి అంటే అప్పు తీసుకోవాలి. అందుకే మంగళవారం వచ్చింది అంటే అప్పు కోసం రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా వద్దకు పరిగెడుతుంది రాష్ట్ర ప్రభుత్వం. గత నెల రోజులుగా ఏకంగా రూ.10,500 కోట్లు చేసి సరి కొత్త రికార్డును సృష్టించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక కార్పోరేషన్ల సంగతి సరే సరి. ఆస్తులు అమ్మకాలు, తనఖాలు మరో పక్క. మద్యం నుంచి వచ్చే ఆదాయం కూడా తాకట్టు పెట్టి అప్పులు తెచ్చి రికార్డు సృష్టించారు. ఇక్కడ మరో విషయం మనం గమనించాలి. ఏడాది పాటు కొంత మేరకు అప్పు తీసుకోవటానికి మాత్రమే, వివిధ రాష్ట్రాలకు కేంద్రం అనుమతి ఇస్తుంది. మనం ఆ లిమిట్ లోపే అప్పులు తెచ్చుగోలం. అయితే ఇందులో కూడా మనం రికార్డు కొట్టాం.

jagan 05102021 2

కేవలం నాలుగు నెలల్లోనే ఏడాది అప్పు లాగేసాం. ఇక అప్పటి నుంచి ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టారు. కేంద్రాన్ని బ్రతిమిలాడుకోగా, చివరకు వారు అనూహ్యంగా రూ.10,500 కోట్ల అదనపు అప్పు కోసం అవకాసం ఇచ్చారు. కేంద్రం ఇలా ఎందుకు అప్పు చేయటానికి అవకాసం ఇస్తుందో ఎవరికీ అర్ధం కాలేదు. అయితే ఈ డబ్బులు కేవలం రెండు నెలల్లో లాగేసారు. ఇప్పుడు అక్టోబర్ నెల గడిచిపోయినా, మళ్ళీ నవంబర్ నెల నుంచి అప్పు కోసం ఢిల్లీ వెళ్ళాల్సిందే. వాళ్ళు ఇస్తేనే, జీతాలు, వడ్డీలు, పెన్షన్లు చెల్లించేది. లేకపోతే, ఈ సారి అది కూడా కుదరదు. కేంద్రం కూడా జగన్ ప్రభుత్వానికి అప్పుల విషయంలో సంపూర్ణ మద్దతు ఇస్తుంది కాబట్టి, ఎవరికీ ఇబ్బంది లేకుండా జరిగిపోతుంది. కాకపొతే, రాష్ట్ర భవిష్యత్తు తరాల పై ఈ అప్పులు భారం పడుతుంది. పరిమితికి మించి అప్పులు చేస్తుంటే అడ్డుకోవాల్సిన కేంద్రం, ఇంకా ఇంకా అప్పులు తెచ్చుకోవటానికి అనుమతి ఇస్తూ ఉండటంతో, మంగళవారం వచ్చింది అంటే, రాష్ట్ర ప్రభుత్వానికి పండుగ వాతావరణం అనే చెప్పాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read