పోయిన ఏడాది ఆగష్టు నెలలో, దేశంలోనే మొదటి సారిగా, మన రాష్ట్రంలోనే మొదటి డ్రోన్ తయారీ జరుగుతుంది అని మేము ఒక ఆర్టికల్ రాస్తే, సోషల్ మీడియాలో కొంత మంది వెటకారం చేశారు... కట్ చేస్తే, ఇవాళ మొదటి డ్రోన్ తయారు అయ్యి, దాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గరకు తీసుకువచ్చారు... దేశంలోనే మొదటి సారిగా, డ్రోన్ ఆంధ్రాలో తయారు అయ్యింది... గర్వంగా దాని మీద మేడ్ ఇన్ ఆంధ్రా అని రాసుకున్నాం... ఇప్పటి వరకూ డ్రోన్లను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఆంధ్రప్రదేశ్ ఇక నుంచి సొంతంగా తయారీ యూనిట్ ను ఏర్పాటు చేసింది...
ఆంధ్రప్రదేశ్ ను గ్లోబల్ డ్రోన్ హబ్ గా మార్చేందుకు డ్రోన్ ఎక్సలెన్స్ సెంటర్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి విశాఖపట్నంలో డ్రోన్ తయారీ పరిశోధన, నైపుణ్య అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఒమ్ని ప్రెసెంట్ కంపెనీ సంస్థ ముందుకు వచ్చింది... ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ, డ్రోన్ తయారీ సంస్థ ఓమ్ని ప్రెసెంట్ భాగస్వామ్యంతో విశాఖపట్నం లో ఏర్పాటు చేసిన అమరావతి డ్రోన్ల కంపెనీ లో తయారు చేసిన మొదటి మేడ్ ఇన్ ఆంధ్రా డ్రోన్ ను కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు లాంచ్ చేసారు...
ఐటి శాఖ మంత్రి నారా లోకేష్, ఐటి శాఖ సెక్రెటరీ విజయానంద్ మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ డ్రోన్ ప్రత్యేకతలను ముఖ్యమంత్రికి వివరించారు.. మార్కెట్ లో దొరికే డ్రోన్ల కంటే ఎక్కువ నాణ్యత, తక్కువ ధరకే మేడ్ ఇన్ ఆంధ్రా డ్రోన్ల తయారీ... ఇప్పటివరకూ దేశంలో ఎక్కడా డ్రోన్ల తయారీ యూనిట్లు లేవు.... తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రమే డ్రోన్ల తయారీకి ముందుకు వచ్చింది.. ఎర్రచందనం ఆక్రమ రవాణాని అరికట్టడం, సిఆర్డిఏ పోలవరం పనులు, స్మార్ట్ పోలీసింగ్ లోనూ డ్రోన్లను ఉపయోగించుకునే అవకాశం ఉంది...