రేపు శాసనమండలి పై జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటాం అని చెప్పిన సంగతి తెలిసిందే. గురువారం రోజున, శాసనమండలి అవసరం లేదు అంటూ, జగన్ మోహన్ రెడ్డి, ఆయన ఎమ్మెల్యేలు, అసెంబ్లీలో చర్చించారు. అదే రోజున శాసనమండలి రద్దు చేస్తూ, బిల్ పెడతారని అందరూ అనుకున్నారు. అయితే, ఎందుకో కాని, గురువారం సభ వాయిదా వేసి, అనూహ్యంగా శుక్రవారం కూడా సెలవు ప్రకటించి, సోమవారం కలుద్దామని జగన్ చెప్పటంతో, స్పీకర్ కూడా దానికి సరే అన్నారు. అయితే ఈ మూడు రోజులు, విపక్ష ఎమ్మెల్సీలను ప్రలోభ పెట్టటానికి, జగన్ ప్రయత్నిస్తున్నారు అంటూ తెలుగుదేశం ఆరోపిస్తుంది. దీనికి సంబంధించి కొన్ని వార్తలు కూడా వచ్చాయి. విపక్ష ఎమ్మెల్సీలను తమ వైపుకు తిప్పుకుని, మండలి చైర్మెన్ పై అవిస్వాసం పెట్టి, సెలెక్ట్ కమిటీ రిపోర్ట్ ని, వారం పది రోజుల్లోనే తీసుకు వచ్చే ప్లాన్ వేసారని తెలుగుదేశం ఆరోపిస్తుంది. ఈ నేపధ్యంలో, మండలి రద్దు, వైసీపీ ప్రలోభాలు, తదితర అంశాల పై, చంద్రబాబు ఈ రోజు టిడిపి ఆఫీస్ లో, ఎమ్మెల్సీలతో సమావేశం కానుకున్నారు.

mlc 26012020 2

ఈ రోజు మధ్యానం ఒంటి గంటకు, మంగళగిరిలో, ఉన్న తెలుగుదేశం కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఎవరైనా గైర్హాజరు అవుతారా, వైసీపీ ప్రలోభాలకు ఎవరైనా లోంగారా అనే విషయం పై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాసం ఉంది. అయితే ఈ సమావేశానికి కంటే ముందే, ఐదుగురు ఎమ్మెల్సీలు తాము గైర్హాజరు అవుతున్నట్టు పార్టీ కార్యాలయానికి సమాచారం ఇచ్చారు. గాలి సరస్వతి, కేఈ ప్రభాకర్, తిప్పేస్వామి, శత్రుచర్ల, రామకృష్ణ, ఈ రోజు జరిగే సమావేశానికి రాలేము అంటూ, సమాచారం అందించారు. దీనికి వారు వ్యక్తిగత కారణాలు ఉన్నాయని చెప్తున్నారు. గాలి ముద్దు కృష్ణమ నాయుడు వర్ధంతి కార్యక్రమం ఉందని, తాను ఈ రోజు రాలేనని గాలి సరస్వతి సమాచారం ఇచ్చారు.

mlc 26012020 3

అలాగే, కేఈ ప్రభాకర్ ఇంట్లో, వాళ్ళ మేనత్త కర్మ కార్యక్రమం ఉండటంతో, ఆయన కూడా రాలేనని చెప్పారు. కేఈ ప్రభాకర్, మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణ మూర్తి సోదరుడు. ఇక తనకు, అనారోగ్యం ఉన్న కారణంగా రాలేనని శత్రుచర్ల చెప్పారు. ఆయన మొన్న కూడా అనారోగ్యం ఉన్నా సభకు వచ్చారు, సభ ఎప్పుడూ పెడితే అప్పుడు వస్తానని సమాచారం ఇచ్చారు. ఇక తిప్పేస్వామి, తన ఇంట్లో శుభకార్యం ఉందని, పెళ్లి ఉండటంతో రాలేనని కబురు పమించారు. ఇక మరో ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ, విదేశాల్లో ఉండటంతో, రాలేనని చెప్పారు. అయితే, ఈ ఐదుగురు ఎమ్మెల్సీలు పార్టీకి విధేయతగా ఉండే వారే కాబట్టి, టిడిపి పెద్దగా ఆందోళన చెందలేదు. సమావేశానికి ఇంకా ఎవరైనా హాజరుకాకుండా ఉంటారా లేదా అనేది చూడాల్సి ఉంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read