విజయవాడలో మరో సారి ఫ్లెక్సీల కలకలం రేపాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ప్రశ్నలు ఎక్కు పెడుతూ, టీడీపీ నేత కాట్రగడ్డ బాబు ఈ ఫ్లెక్సీలు పెట్టారు. "మీ సినిమా రాజకీయాలకు పనికిరాదు. మీరు మద్దతు ఇవ్వకపోతే 2014లో బాబు రిటైర్ అయ్యేవరా. నేను కూయ్యాందే తెలవదు అందంట ఓ అమాయకపు కోడి అలా వుంది మీ తీరు. ఎందుకీ అహంకార పూ మాటలు. ఒక్కటి, రెండు సీట్లు వస్టే మీకు ఎక్కువే. అన్నదమ్ములు ఇద్దరూ కలిస్తే 2009 లో వచ్చినివవి 18 సీట్లే. ఇప్పుడు తల్లకిందులుగా తపస్సు చేసిన మీకు ఒక్క సీటు వచ్చే అవకాశాలు లేవు. ఐదు కోట్ల రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో బాబు సీఎం కావడం తద్యం" అని ఫ్లెక్స్ లో పేర్కొన్న కాట్రగడ్డ బాబు.
నగరంలో పలు ప్రాంతాలలో పాటు, వెలగపూడి ప్రాంతాల్లో ఈ ఫ్లెక్సీలు పెట్టారు. నగరంలో ఇప్పుడు ఈ ఫ్లెక్సీలు చర్చనీయంసం అయ్యాయి. మొన్న పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబుని ఉద్దేశించి మాట్లాడుతూ, "చంద్రబాబు, మీ సియం సీట్ నా బిక్ష. నేను మీకు మద్దతు ఇవ్వకపోతే, ఈ పాటికి మీరు రిటైర్డ్ అయ్యి ఇంట్లో కూర్చునే వారు. నేను మిమ్మల్ని గెలిపించాను అనే సంగతి మర్చిపోవద్దు. నేను తలుచుకుంటే, మీ వాళ్ళని కళ్ళు ఇరగొట్టి కూర్చోబెడతా" అంటూ నోటికి ఇష్టం వచ్చినట్టు పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఆ వ్యాఖ్యల పై నిరసనగా, ఇలా ఫ్లెక్సీల రూపంలో, కాట్రగడ్డ బాబు, ఫ్లెక్సీలు వేసారు. కోడి కూడా తాను కుయ్యకపోతే, తెల్లవారదు అనుకునేది అంటూ ఫ్లెక్స్ వేసారు.
ప్రజలు కూడా ఈ ఫ్లెక్స్ చూసి, పవన్ మాటలు గుర్తు తెచ్చుకుని నవ్వుకుంటున్నారు. తన సొంత అన్న ఓడిపోయాడని, వచ్చింది ముక్కి ములిగి 18 సీట్లు అని, అవి కూడా అమ్మేశారని, ఇలాంటి పవన్, చంద్రబాబు లాంటి నేతకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చినట్టు బిల్డ్ అప్ లు చూస్తుంటే, నవ్వు వస్తుంది అని అంటున్నారు. లోకేష్ ను అడిగే ముందు, అసలు పవన్ వార్డ్ మెంబెర్ గా అయినా గెలిచారా అని, మరి అలాంటి పవన్, ముఖ్యమంత్రిని చెయ్యండి అని ఎలా అడుగుతారని, లోకేష్ ని అడిగే ముందు, పవన్ తనను తాను ప్రశ్నించుకోవాలని అంటున్నారు. ఇందిరా గాంధీ నుంచి, ఈ రోజు మోడీ దాకా డీ కొట్టిన చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడుని, నేనే గెలిపించా అని పవన్ అంటుంటే, నిజంగానే కోడి కూత సామెత గుర్తుకు వస్తుందని అంటున్నారు.