నవ్యాంధ్రప్రదేశ్ నుంచి దేశ ఆర్థిక రాజధానికి అనుసంధానం చేసేందుకు ఎయిర్ ఇండియా (ఏఐ) దృష్టి సారించింది. గన్నవరం నుంచి ముంబై కు నూతన సర్వీసును జనవరి 15వ తేదీ నుంచిప్రారంభించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ముందుగా హైదరాబాద్‌ నుంచి ముంబయికి నడుస్తున్న సర్వీసును గన్నవరం వరకూ పొడిగించనున్నారు. తర్వాత.. పూర్తిస్థాయిలో ఇక్కడి నుంచి నేరుగా ముంబయికి సర్వీసులు ఏర్పాటు చేయనున్నట్టు అధికారులు, ఎయిర్‌ ఇండియా సిబ్బంది పేర్కొంటున్నారు. గతంలో ఢిల్లీ కి సర్వీసును ప్రారంభించినప్పుడు కూడా ఇలాగే మొదట హైదరాబాద్‌ నుంచి నడిచే విమానాన్ని ఇక్కడికి పొడిగించారు. తరువాత డైరెక్ట్ ఫ్లిట్ వేశారు...

gannavaram 08122017 1

ముంబయికి విమాన సర్వీసును ఏర్పాటు చెయ్యటంతో, వ్యాపార వర్గాలకే కాక, విదేశాలకు వెళ్ళేవారికి కూడా, ఈ సర్వీసులు ఉపయోగపడతాయి. ప్రస్తుతం విదేశాల నుంచి విజయవాడకు వచ్చేవారు, ఎవరైనా హైదరాబాద్‌లోనో లేక, ముంబయిలో దిగి అక్కడి నుంచి మళ్లీ హైదరాబాద్‌కు చేరుకుని, విజయవాడకు రావాల్సి వస్తోంది. ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది... గన్నవరం ఎయిర్పోర్ట్ ఉండి కూడా, ముంబైలో దిగి, మళ్ళీ హైదరాబాద్ వచ్చి, విజయవాడ రావాల్సి వస్తుంది... దీంతో గన్నవరం నుంచి ముంబై కి సర్వీసులను ఏర్పాటు చేయాలంటూ, పౌరవిమానయానశాఖకు ఇక్కడి వ్యాపార సంఘాల నుంచి లేఖలు చాలాకాలంగా రాస్తున్నారు.

gannavaram 08122017 1

దేశంలోనే రెండో అతిపెద్ద రద్దీ ఎయిర్ పోర్ట్ ముంబయి కావడంతో, అక్కడి నుంచి ప్రపంచంలోని ఏ దేశానికైనా సులభంగా చేరుకునేందుకు ఇక్కడి వారికి కనెక్టివిటీ ఏర్పడుతుంది. ప్రస్తుతం హైదరాబాద్‌కు వచ్చే అంతర్జాతీయ సర్వీసుల్లో ఎక్కువశాతం అర్థరాత్రి దాటాకే వస్తాయి. అక్కడి నుంచి విజయవాడకు రావాలంటే ఉదయం వరకూ వేచి చూడాల్సిందే. అదే ముంబయికి సర్వీసులను ఏర్పాటు చేస్తే.. ఈ సమస్య ఉండదు. ఇక ఎయిరిండియా సర్వీసులో ఇక్కడి నుంచి వెళ్లి.. అదే సంస్థ ముంబయి నుంచి విదేశాలకు నడిపే సర్వీసులను అందుకోవచ్చు. టిక్కెట్లను సైతం నేరుగా తీసుకునేందుకు వీలు కుదురుతుంది. దీంతో జపాన్‌, దుబాయ్‌ సహా ఏ దేశానికైనా నేరుగా విజయవాడ నుంచి చేరుకున్నట్టుగానే ఉంటుంది. సమయం వృథా కాకుండా వెళ్లేందుకు మార్గం సుగమమవుతుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read