2018 నాటికి రాష్ట్రంలో 10 మె.వా. సామర్థ్యం కలిగిన ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టు స్థాపనకు సన్నాహాలు జరుగుతున్నాయి. 2018 సంవత్సరంలో ఉత్పత్తి ప్రక్రియనూ ప్రారంభించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
ప్రపంచ బ్యాంకు సమకూర్చే నిధులతో ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నారు. నిలకడగా ఉన్న నీటి మీద వీటిని స్థాపించనున్నారు. ఈ ప్రాజెక్ట్ కు రూ.70 కోట్ల వ్యయం అవుతుంది. ఈ ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం లేదా సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాచూసుకుంటుంది.
2014లో పశ్చిమ బెంగాల్లోని రాజర్ ఘాట్ లో నెలకొల్పిన ప్రాజెక్ట్ దేశంలోని మొదటి ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టు. ప్రాజెక్టుల స్థాపనకు అవసరమైన భూసేకరణ ప్రక్రియలో ఎదురవుతున్న అనుభవాలను పరిగణనలోకి తీసుకుని ప్రస్తుతం నీటి మీద తేలియాడే (ఫ్లోటింగ్) ప్రాజెక్టుల స్థాపనకు మొగ్గుచూపుతున్న పరిస్థితి ఉంది.