పోలవరం ప్రాజెక్ట్ విషయంలో ముఖ్యమంత్రి వైపు వేలు ఎత్తి చూపించే వారు ఉండరు... చంద్రబాబు ఆ ప్రాజెక్ట్ విషయంలో అంత శ్రద్ధ తీసుకుని, కాంట్రాక్టర్ సరిగ్గా పని చెయ్యకపోతే, అతన్ని మార్చి, నవయుగ కంపనీకి ఇచ్చి, పనులు పరిగెత్తే విధంగా శ్రద్ధ తీసుకున్నారు... దీని కోసం కేంద్రంతో గెట్టిగా పోరాడారు... ఎందుకంటే, ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది, మన రాష్ట్ర జీవ నాడి.. ఇప్పుడు విజయవాడ ప్రజలు కూడా, ఆ ఒక్క ప్రాజెక్ట్ విషయంలో విసుగెత్తి పోయారు... ఇది పోలవరంలా జీవనాడి, కాకపోయినా, రోజు వారీ జీవితాలతో ముడి పడిన అంశం కాబట్టి, ఈ ప్రాజెక్ట్ కాంట్రాక్టర్ ని కూడా మార్చమని విజయవాడ ప్రజలు, ముఖ్యమంత్రికి విన్నవించుకుంటున్నారు...

vijayawada 25012018 2

ఆ ప్రాజెక్ట్ ఏంటి అనుకుంటున్నారా... అదే కనకదుర్గ ఫ్లై ఓవర్... విజయవాడ ప్రజల చిరకాల కోరిక చంద్రబాబు నెరవేరుస్తున్నాడు అని ప్రజలు సంతోషించారు.. కాని, ఇప్పటికి ఆ ప్రాజెక్ట్ మొదలు పెట్టి, రెండున్నర ఏళ్ళు అవుతున్నా, ఇప్పటికీ పనులు జరుగుతూనే ఉన్నాయి... ఎప్పటికి అవుతుందో తెలియని పరిస్థితి.. రాష్ట్ర ప్రభుత్వం ఎంత వెంట పడుతున్నా, కాంట్రాక్టర్ మాత్రం పనులు ముందుకు తీసుకువెళ్లటం లేదు... ఇది నేషనల్ ప్రాజెక్ట్ కావటంతో, కేంద్రం నిధులు ఇస్తుంది... రాష్ట్ర ప్రభుత్వం కూడా దీంట్లో వాటా ఉంది.. ఈ ప్రాజెక్టులో కేంద్రం రూ.334కోట్లు భరించాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం రూ.114.60కోట్లు కేటాయించాల్సి ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తన వాటాకి మించి ఖర్చు పెట్టింది... కేంద్రం మాత్రం, సాకులు చెప్తూ, డబ్బులు వదలటం లేదు.. దీంతో కాంట్రాక్టర్ పనులు సాగదీస్తున్నాడు...

vijayawada 25012018 3

అదనపు పనులకు సంబంధించిన నిధులను మంజూరుకు కేంద్రం నిరాకరించింది. ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వం భరించాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ‘ఇస్తే కేంద్రం ఇస్తుంది.. లేకపోతే మనమే భరిద్దామ’ని సీఎం చంద్రబాబునాయుడు అధికారులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ రహదారి పైవంతెనకు రూ.114.60 కోట్లు కేటాయిస్తే ఇప్పటికే రూ.170 కోట్లు చెల్లింపులు జరిపింది. ఈ పైవంతెన పనులు ప్రారంభం అయిన నాటి నుంచి ఇంత వరకు రూ.150 కోట్ల వరకు కేంద్ర పీఏఓ నుంచి బిల్లులు మంజూరు అయ్యాయి... తాజాగా కాంట్రాక్టర్ 20 కోట్లు కావాలి అని బిల్లులు పెట్టుకుంటే, కేంద్రం రెండు నెలల నుంచి డబ్బులు ఇవ్వటం లేదు... పని ఆపేస్తాను అని బెదిరించటంతో, రాష్ట్ర ప్రభుత్వమే, ప్రస్తుతానికి పనులు ఆగకుండా, 10 కోట్లు విడుదల చేసింది... అందుకే ప్రజలు, చంద్రబాబుని వేడుకుంటున్నారు... ఈ ప్రాజెక్ట్ పై కూడా, కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి, కాంట్రాక్టర్ ను మార్చటమో, ఒత్తిడి తెచ్చి కేంద్రం నిధులు విడుదల అయ్యేలా చెయ్యటమో చెయ్యాలని కోరుకుంటున్నారు...

Advertisements

Advertisements

Latest Articles

Most Read