భారత ప్రభుత్వం ఆదేశాల మేరకు నాఫెడ్ సంస్థ ఆధ్వర్యంలో బంగ్లాదేశ్ శరణార్ధులకు 620 టన్నుల ఆహార పదార్ధాలను కాకినాడ డీప్ వాటర్ సీపోర్టు నుండి ప్రత్యేక నౌకలో సోమవారం పంపించారు. ఈ పంపిణీ ఆహార పదార్ధాల రవాణాను జిల్లా కలక్టర్ కార్తికేయ మిశ్రా పోర్టులో పరిశీలించి, నౌకను బంగ్లాదేశ్ పంపారు.

ఈ సంద‌ర్భంగా కలక్టర్ కార్తికేయు మిశ్రా మాట్లాడుతూ భారత ప్రభుత్వం నాఫెడ్ సూచనల మేర బంగ్లాదేశ్ శరణార్ధుల కోసం 620 టన్నుల ఆహార పదార్ధాలను 62 వేల ప్యాకెట్లలో ఐయన్యస్ ఘరియూర్ నౌకలో పంపడం జరిగిందన్నారు. ఈ ఆహార పదార్థాలను రావులపాలెంలో 40 వేలు, చొల్లంగిలో 22 వేలు ప్రాకింగ్ చేయడం జరిగిందన్నారు. ప్రతీ ప్యాకెట్లో 5 కేజీల బియ్యం, 2 కేజీల పప్ప, ఒక లీటర్ ఆయిల్, ఒక కేజీ ఉప్ప, ఒక కేజీ అముల్ మిల్క్ పౌడర్, దోమతెర, సబ్బులు, టీపొడి, కలిపి ఒక్కొక్కటి 11.50 కేజీలు ఉన్నాయన్నారు.

సోమవారం నాడు కాకినాడ నుండి బయలుదేరిన ఈ నౌక ఈ నెల 28వ తేదీ ఉదయం 5 గంటలకు చిట్టిగ్యాంగ్ పోర్టుకు చేరుకొంటుందన్నారు. ఈ ఆహార పదార్ధాల ప్యాకింగ్లో జిల్లా యంత్రాంగం పూర్తిగా సహకరించి ఆదివారం సాయంత్రానికి ఈ ప్యాకెట్లను పోర్టుకు చేర్చి నౌకలో లోడ్ చేయడం జరిగింన్నారు. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం , ఈ నౌకలో ఆహార పదార్ధాలను లోడ్ చేసి పంపడం జరిగిందని కలక్టర్ తెలిపారు. ఈ నౌకలో కెప్టెన్ స్వరాజ్ జేమ్స్ రబీరాతో పాటు అధికారులు, సిబ్బంది క‌లిపి మొత్త 120 మంది ప్రయాణమై వెళ్ళారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read