దేశ వ్యాప్తంగా ఎన్నికల నగారా మోగింది. కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి సునీల్ అరోరా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. మొదటి దశలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లోనే తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి. ఇరు రాష్ట్రాల్లో ఏప్రిల్‌ 11న ఎన్నికలు జరగనున్నాయి. షడ్యుల్ ప్రకటించిన అనంతరం ఏపీ, తెలంగాణో డేటా చోరీపై ఆయన మాట్లాడారు. "ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఓట్ల తొలగింపు, ఫామ్‌-7పై.. మాకు ఫిర్యాదులు అందాయి. ఓట్ల తొలగింపు అంశంపై దర్యాప్తు ప్రత్యేక బృందాన్నీ పంపాము. బృందం నివేదికను ఇచ్చిన తరవాత చర్యలు తీసుకుంటాము. ఆయా రాష్ట్రాల సీఈవోల నుంచి వివరాలు కోరాం" సీఈసీ తెలిపారు.

cec 10032019

మరో పక్క, తెదేపాకు సంబంధించిన సమాచారం చోరీకి గురైందంటూ నమోదైన కేసులో సిట్‌ దర్యాప్తును వేగవంతం చేసింది. అందులో భాగంగా ఏపీ తెదేపా అధ్యక్షుడు కళా వెంకట్రావు ఫిర్యాదులో పేర్కొన్న వాటితో పాటు తాము సేకరించిన ప్రాథమిక సమాచారంలోని అంశాలను క్రోడీకరించి విశ్లేషిస్తోంది. సమాచార తస్కరణ జరిగి ఉంటే దానికి సంబంధించిన డిజిటల్‌ ఆధారాల సేకరణ, దీని వెనుక జరిగిన కుట్ర మూలాలను గుర్తించాలని తొలి లక్ష్యంగా పెట్టుకున్న సిట్‌.. ఆ మేరకు సభ్యుల మధ్య పని విభజన పూర్తి చేసింది. కేసు దర్యాప్తునకు సంబంధించి సిట్‌ సభ్యులైన పి.హరికుమార్‌, ఎస్‌.వి.రాజశేఖర్‌బాబు, పీహెచ్‌డీ.రామకృష్ణ, యు.రామ్మోహన్‌రావుల మధ్య పని విభజన పూర్తిచేసి వారికి వేర్వేరు బాధ్యతలు అప్పగించింది. ఒకటి రెండు రోజుల్లో వనరులన్నీ సమకూర్చుకున్న అనంతరం సిట్‌ దర్యాప్తు మరింత వేగవంతం కానుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read