ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీల మధ్య డేటా లీక్ తో పాటు ఫారం-7 అంశం కూడా తీవ్రరూపం దాల్చుతోంది. ఓట్ల తొలగింపుకు ఉద్దేశంచిన ఫారం-7ను కనీవినీ ఎరుగని స్థాయిలో దుర్వినియోగం చేస్తున్నారంటూ పెద్దఎత్తున ఆరోపణలు రావడం తెలిసిందే. దీనిపై ఎన్నికల సంఘానికి టీడీపీ మంత్రులు ఫిర్యాదు చేశారు. ఇది వైసీపీ పనే అని మంత్రులు ఫరూఖ్, అమర్ నాథ్ రెడ్డి తదితరులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో, ఫారం-7 దరఖాస్తుల దర్యాప్తులో కొత్త కోణం తెరపైకి వచ్చింది. ఏపీకి సంబంధించిన ఓట్లను తొలగించాలంటూ హైదరాబాద్ నుంచే కాకుండా ఎక్కడో బీహార్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ తదితర ప్రాంతాల నుంచి కూడా ఆన్ లైన్ లో దరఖాస్తులు అప్ లోడ్ అయినట్టు ఏపీ పోలీసులు గుర్తించారు.

form7 10032019

అంతేకాదు, 80 ఏళ్ల వృద్ధుడి పేరుతోనూ ఫారం-7 దరఖాస్తు కనిపించినట్టు సమాచారం. దానికితోడు మరణించినవారి పేరుతోనూ దరఖాస్తులు కుప్పలకొద్దీ దర్శనమిచ్చినట్టు తెలుస్తోంది. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులోనే ఈ విషయాలన్నీ తెలియడంతో, లోతుగా దర్యాప్తు చేస్తే కళ్లు చెదిరే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు. సదరు దరఖాస్తుల్లో పేర్కొన్న ఓటర్ల ఐడీలు ఇవ్వాలని, ఆ ఐడీలతో తమ వద్ద ఉన్న సమాచారాన్ని సరిపోల్చుకుంటామంటూ ఏపీ పోలీసులు ఎన్నికల సంఘాన్ని కోరారు. ఎన్నికల సంఘం ఏపీ పోలీసుల విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించింది. త్వరలోనే ఐడీ వివరాలు అందజేస్తామని పేర్కొంది. ఈ నేపథ్యంలో, ఫారం-7 అక్రమాల గుట్టు త్వరలోనే వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

form7 10032019

రాష్ట్రంలో పోలింగ్ బూత్ అధికారులు మండల తాహశీల్దారు ఇచ్చిన పిర్యాదు మేరకు ఇప్పటి వరకు 350 కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసులను రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందానికి అప్పగించింది. ఆ బృందం ఇప్పటికే సేకరంచిన సమాచారాన్ని పోలీస్ బాస్‌కు తెలియజేశారు. ఆన్‌లైన్‌లో అందిన దరఖస్తుల గుట్టు రట్టవ్వాలంగే ఎన్నికల కమషన్ సర్వర్‌లోని బ్యాకప్ డేటాను సేకరించాల్సి ఉంటుంది. కేంద్ర ఎన్నికల కమషన్ సర్వర్లు కోయంబత్తూరులోని సీ డాక్‌లో ఉంటాయి. ఈ సర్వర్ల బ్యాకప్ డేటాను తీసుకోవాలంటే ఐడీ నెంబర్ కేటాయించాల్సి ఉంటుంది. ఐడీ నెంబర్ ఆధారంగా బ్యాకప్ ఓపెన్ చేస్తే ఆన్‌లైన్‌లో అందిన దరఖాస్తుల గుట్టు రట్టుకానుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read