రాష్ట్రంలో విశాలమైన నేషనల్ హైవేలకు తోడు, ఇప్పుడు వాటర్ ట్రాన్స్పోర్ట్ (జల రవాణా) కూడా తోడవ్వనుంది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని ముక్త్యాల నుంచి విజయవాడ దాకా 90 కిలోమీటర్ల మేర కృష్ణా నదిలో జల రవాణాకు అక్టోబరు 3న కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ శంకుస్థాపన చేయనున్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ కార్యక్రమంలో పాల్గుననున్నారు.

100 కోట్లతో ఈ ప్రాజెక్ట్ పూర్తి చెయ్యనున్నారు. 40 కోట్లు జలరవాణా మార్గానికి, మిగతా 60 కోట్లతో, ముక్త్యాల, ఇబ్రహీంపట్నం, హరిశ్చంద్రపురం వద్ద మూడు టెర్మినళ్లను నిర్మిస్తారు. విజయవాడలోని దుర్గాఘాట్‌, భవానీ ద్వీపం, కృష్ణా జిల్లాలోని వేదాద్రి, గుంటూరు జిల్లాలోని అమరావతి వద్ద ప్రయాణికుల రవాణా కోసం ఫ్లోటింగ్‌ టెర్మినళ్లు నిర్మిస్తారు.

జల రవాణాలో సరుకు రవాణాతో పాటు, ప్రయాణికులు కూడా ఈ రూట్ ఉపయోగించుకోవచ్చు. అటు పర్యాటకంగా కూడా ఉపయోగపడుతుంది. జగ్గయ్యపేట నుంచి రాజధానికి రోడ్డు మార్గంలో రవాణా చేయాలంటే సుమారు 140 కిలోమీటర్లు వెళ్లాలి. అదే జల రవాణా మార్గంలో 70 కిలోమీటర్ల ప్రయాణంతోనే రాజధానికి చేరుకోవచ్చు. రోడ్డు మార్గంలో రవాణా చేసేందుకయ్యే ఖర్చులో మూడో వంతు ఖర్చుతోనే జలరవాణా చేయవచ్చు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read