రాష్ట్ర ప్రభుత్వం కర్నూలు జిల్లాలో అంతర్జాతీయ స్థాయి విత్తన పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇందుకోసం కర్నూలు జిల్లాలోని జూపాడు బంగ్లా మండలం, తంగెడంచ గ్రామంలో దాదాపు 650 ఎకరాల విస్తీర్ణంలో రూ.670 కోట్లతో అంతర్జాతీయ స్థాయి విత్తన పరిశోధన కేంద్రానికి రేపు (సోమవారం) మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయనున్నారు.

రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానన్న ముఖ్యమంత్రి వాగ్దానానికి కట్టుబడి ఈ మెగా సీడ్ పార్కుకు ప్రభుత్వం నాంది పలికింది. అదే రోజు అమెరికాకు చెందిన ఐయోవా యూనివర్సిటీతో ఒప్పందాన్నికూడా రాష్ట్ర ప్రభుత్వం చేసుకోనుంది. రూ.150 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుండగా, మరో రూ.500 కోట్ల రూపాయల నిధులను కేంద్ర ప్రభుత్వం నుండి రాబట్టుకోవాలని రాష్ట్ర వ్యవసాయశాఖ కేంద్రానికి ప్రతిపాదనలు పంపనుంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలు కేటాయించడంతో తాజాగా కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేయనున్న మెగా సీడ్ పార్కుకు అయ్యే ఖర్చులో కేంద్ర వాటా కోరాలని భావిస్తున్నారు.

పట్టిసీమ ప్రాజెక్టుతో రాయలసీమ ప్రాంతంలోని కర్నూలు, నంద్యాల వ్యవసాయదారులు నీరు అందిచటంలో ప్రభుత్వం అనుకున్నదాన్ని సాధించిన నేపథ్యంలో అదే ప్రాంతంలో విత్తనాభివృద్ధి కేంద్రంతో పాటు, అత్యాధునిక పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు ప్రణాళికలు రూపొందించారు.

ఈ పార్కుల అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ప్రయోగశాలలు, సీడ్ ప్రాసెసింగ్ సదుపాయాలు, విత్తన పరిశోధన, అభివృద్ధి కేంద్రంతో పాటు విత్తన ఎగుమతికి అవసరమైన నాణ్యతా ప్రమాణాలతో కూడి అన్ని ఏర్పాట్లు చేయనున్నారు. విత్తన పరిశోధన, నవ్య ఆవిష్కరణలు చేపట్టడం, వ్యాపారాభివృద్ధితో పాటు విత్తన వ్యాపారానికి ఇంక్యూబేటర్గా ఉండటం, మానవ వనరుల అభివృద్ధి, ప్రపంచ విత్తన కార్యక్రవూలు చేపట్టడం, ప్రభుత్వ విత్తన విధి విధానా లకు చేయూత నివ్వడం, రైతులకు వ్యవసాయ పరిజ్ఞానాన్ని అందివ్వడం వంటి కార్యక్రమాలకు "మెగాసీడ్ పార్క్ వేదిక కానుంది. ఇక్కడకు 100 పైగా అంతర్జాతీయ విత్తన సంస్థలు వస్తున్నాయి. దీనికి అయోవా విశ్వవిద్యాలయం సాంకేతిక సహకారం అందిస్తోంది.

అలాగే దేశంలోని ప్రముఖ విత్తన కంపెనీలతో పాటు, చిన్న కంపెనీలకూ ఈ పార్కులో భూములు కేటాయించనున్నారు. ప్రస్తుతం తమిళనాడులో ఉన్న సీడ్ పార్క్ దేశంలో ఉత్తమమైనదిగా పేరుంది. దాని కంటే మిరంత అత్యాధునికంగా కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేయబోయే 'మెగా సీడ్ పార్కు ఆవిష్కరణ కార్యక్రమంలో రైతు సంఘాలతో పాటు రాష్ట్ర జాతీయ విత్తన సంస్థలు కూడా పాల్గొంటున్నాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read