ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు కొద్ది సేపటి క్రితం ఢిల్లీ చేరుకున్నారు. రేపు జరగనున్న నీతి ఆయోగ్‌ సమావేశంలో ఏపీ సీఎం పాల్గొననున్నారు. చంద్రబాబు భాజపా యేతర సీఎంలతో సమావేశమవుతున్నారు. ఏపీ భవన్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పశ్చిమ్‌ బంగ సీఎం మమతా బెనర్జీ భేటీ అయ్యారు. ఎయిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న వాజ్‌పేయీని పరామర్శించిన దీదీ నేరుగా ఏపీ భవన్‌కు చేరుకోగానే ఆమెకు సాదరస్వాగతం పలికిన సీఎం.. ఆ తర్వాత ఆమెతో సుమారు 20 నిమిషాల పాటు సమావేశమయ్యారు. వీరి భేటీలో పలు కీలక అంశాలను చర్చించినట్టు సమాచారం.

cbndelhi 16062018 2

అనంతరం కేరళ సీఎం పినరయి విజయన్‌, కర్ణాటక సీఎం కుమారస్వామితోనూ చంద్రబాబు భేటీ అయ్యారు. ప్రస్తుతం నలుగురు సీఎంల కీలక భేటీ కొనసాగుతోంది. రేపు జరగబోయే నీతి ఆయోగ్‌ సమావేశంలో రాష్ట్రాలకు సంబంధించిన అధికారాల విషయంలో ఎలాంటి తేడా వచ్చినా ఎలాంటి వ్యూహం అనుసరించాలనే దానిపై నేతలంతా కూలంకుషంగా చర్చించినట్టు సమాచారం. ఏపీ భవన్‌ వేదికగా జరిగిన ఈ భేటీలో దేశంలో తాజా రాజకీయ పరిణామాలపై నేతలు చర్చిస్తున్నారు. ఈ భేటీ అనంతరం రాత్రికి చంద్రబాబు, మమతా బెనర్జీ, కర్ణాటక సీఎం కుమారస్వామి దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ వద్దకు వెళ్లనున్నారు. పలు సమస్యల పరిష్కారం కోసం లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కార్యాలయంలో గత కొన్ని రోజులుగా దీక్షకు దిగిన కేజ్రీవాల్‌కు నేతలు సంఘీభావం తెలపనున్నారు.

cbndelhi 16062018 3

అయితే, కేజ్రీవాల్‌ను కలిసేందుకు మమత ఎల్జీ కార్యాలయాన్ని అనుమతి కోరగా.. అధికారులు మమతకు అనుమతి నిరాకరించారు. చంద్రబాబు, మమత, కుమారస్వామి కేజ్రీని కలిసేందుకు వెళ్లాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో ఎల్జీ కార్యాలయం తీసుకున్న నిర్ణయంపై ఎలాంటి వైఖరి అనుసరించాలి?, కేజ్రీవాల్‌ను ఎలా కలవాలనే అంశాలపై నలుగురు ముఖ్యమంత్రులు చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఈరోజు ముస్లింలు రంజాన్‌ పండుగ జరుపుకుంటోన్న విషయం తెలిసిందే. మరోవైపు ఢిల్లీలో రేపు నీతి ఆయోగ్‌ సమావేశం జరగనుంది. దీంతో ఆ సమావేశం వాయిదా వేయాలని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు లేఖలు రాసినప్పటికీ నీతి ఆయోగ్‌ అందుకు ఒప్పుకోలేదు. తాజాగా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ విషయంపై మాట్లాడారు. ఈద్ ఉన్న విషయం కేంద్ర ప్రభుత్వ అధికారులకు తెలియదా? అని నిలదీశారు. అందుకే ఎవరికీ ఇబ్బంది లేకుండా తేదీని మార్చాలని గతంలో తాను కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలిపారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read