అసలు ఈ రాష్ట్రంలో ఏమి జరుగుతుందో అర్ధం కాని పరిస్థితి. ప్రజాస్వామ్యం లేకుండా చెయ్యాలనే కుట్ర జరుగుతుందా ? ప్రజలు స్వేచ్చగా, అన్నీ ఆలోచించుకుని, ఎవరి ఓటు వెయ్యాలి, ఈ రాష్ట్ర భవిష్యత్తు ఎవరి చేతిలో పెట్టాలి అనే ఆలోచన చేసే టైం కూడా లేకుండా, ఇన్ని కుట్రలా ? ఇన్ని కుట్రలు చేసి, ఏమన్నా సాధిస్తున్నారా అంటే, ప్రతిది సెల్ఫ్ గోల్. నిన్న రాష్ట్రంలో జరిగిన నాలుగు విషయాలు చూస్తే, జగన్ గురించి విస్తుపోయే నిజాలు బయటి రాబోతున్నాయా అనే సందేహం, వ్యక్తమవుతుంది. ఆ నాలుగు ఇవే..:1. ఎన్నికలు 15 రోజుల్లో పెట్టుకుని, ఇంత ముఖ్యమైన సమయంలో, జగన్ మోహన్ రెడ్డి, ప్రచారం చెయ్యకుండా, నిన్న అంతా, కేవలం హైదరాబాద్ లోని, తన లోటస్ పాండ్ కే ఎందుకు పరిమితం అయ్యారు ?

jagan 27032019

2.మొన్న సాయంత్రం ఢిల్లీ వెళ్ళి ఎన్నికల కమీషన్ కి ఫిర్యాదు చేసిన విజయసాయి రెడ్డి, ఉన్నట్టు ఉండి, నిన్న అనారోగ్యం పేరుతో, బెంగుళూరు హాస్పిటల్ లో ఎందుకు జాయిన్ అయ్యారు ? 3. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు పై, సిట్ అధికారులు తుది నివేదిక సమర్పించకుండా చూడాలని, సిట్‌ను ఆదేశించాలని వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఏపీ హైకోర్టును ఎందుకు ఆశ్రయించారు ? 4. నిన్న సాయంత్రం, కడప ఎస్పీ ఉన్న పలంగా బదిలీ అవ్వటం... ఈ నాలుగు విషయాలు దగ్గరగా గమనిస్తే, ఎదో పెద్ద విషయం బయటకు రాబోతుంది అని ముందే గ్రహించి, జగన్ మోహన్ రెడ్డి, నిన్నంతా ఎదో ప్లాన్ చేసారనే అనుమానం బల పడుతుంది.

jagan 27032019

గత రెండు రోజులగా మీడియాలో, వైఎస్ వివేక హత్య కేసులో అరెస్ట్ లు ఉండబోతున్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి. వైఎస్ కుటుంబంలోనే వ్యక్తులే హత్య చేసారనే ఆధారాలు పోలీసులు వద్ద ఉన్నాయంటూ వార్తలు వచ్చాయి. ఈ విషయాలు అన్నీ గమనిస్తే, జగన్ గురించి విస్తుపోయే నిజాలు బయటి రాబోతున్నాయా అనే సందేహం కచ్చితంగా కలుగుతుంది. ఎవరైనా కుటుంబ సభ్యుడు చనిపోతే, హంతకుడుని పట్టుకోండి, శిక్ష వెయ్యండి అంటారు, కాని ఇక్కడ జగన్ మాత్రం, కోర్ట్ కి వెళ్లి మరీ, సిట్ అధికారులు తుది నివేదిక సమర్పించకుండా చూడాలని, సిట్‌ను ఆదేశించాలని జగన్మోహన్‌రెడ్డి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. మొత్తానికి, ఈ పరిణామాలతో, జగన్ మరో సెల్ఫ్ గోల్ వేసుకున్నారా అంటే, అవును అనే చెప్పాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read